ETV Bharat / city

రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలి: హరీశ్‌ - జీఎస్​టీపై హరీశ్​ రావు

ఐజీఎస్‌టీ బకాయిల పరిష్కారంపై మంత్రుల బృందం సమావేశమైంది. ఐజీఎస్‌టీ కన్వీనర్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయిలు వెంటనే ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి డిమాండ్ చేశారు.

harish
harish
author img

By

Published : Sep 22, 2020, 5:47 PM IST

రాష్ట్రానికి రావాల్సిన రూ.2,641 కోట్ల ఐజీఎస్టీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు కోరారు. బకాయిల విషయమై బిహార్ ఉపముఖ్యమంత్రి, ఐజీఎస్టీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం జరిగింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా హరీశ్​ రావు పాల్గొన్నారు. తెలంగాణ సహా 16 రాష్ట్రాలకు 2018 నుంచి రావాల్సిన రూ.25,058 కోట్ల ఐజీఎస్టీ నిధుల విషయమై సమావేశంలో చర్చించారు.

భేటీకి ముందే ఇచ్చేలా సిఫార్సు చేయండి

రాష్ట్రానికి రూ.2,641 కోట్లు రావాల్సి ఉండగా... రూ.2,638 కోట్లు ఐజీఎస్టీ చెల్లించాల్సి ఉందని కౌన్సిల్ ‌లెక్కలు వేసిందని మంత్రి హరీశ్​ రావు అన్నారు. వచ్చే నెల 5న జరిగే జీఎస్టీ మండలి భేటీకి ముందే విడుదల చేయాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. వారం రోజుల్లో సిఫార్సు చేయాలని కమిటీ కన్వీనర్‌ సుశీల్ కుమార్ మోదీకి విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ నిధులు వస్తే చాలా ఊరట కలుగుతుందని అన్నారు.

మరోసారి సమావేశం

రానున్న జీఎస్టీ‌ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మరో మూడు నెలలు ఆగాల్సి వస్తుందన్న మంత్రి... వెంటనే ఐజీఎస్టీ నిధులు రాష్ట్రాలకు అందేలా సిఫార్సు చేయాలని సూచించారు. హరీశ్​ రావు సూచనపై సానుకూలంగా స్పందించిన సుశీల్ కుమార్ మోదీ... అక్టోబర్ ఒకటో తేదీన మరోమారు సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి వసూలు‌ చేయాల్సిన రూ.1,015 కోట్లను కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి భవిష్యత్తులో చెల్లింపుల సమయంలో సర్దుబాటు చేయాలని హరీశ్​ రావు సూచించారు. 18 రాష్ట్రాల నుంచి రికవరీ చేయాల్సిన కాంపన్సేషన్ ఫండ్​ను‌ ఆ రాష్ట్రాలకు భవిష్యత్తులో చెల్లించే పరిహార మొత్తంలో సర్దుబాటు చేయాలని అన్నారు.

ఇదీ చదవండి : కేటీఆర్​ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.