ETV Bharat / city

'హరీశ్‌రావుకు, కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ..' - హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అమర్​నాథ్​

AP MINISTER AMARNATH ON HARISH RAO COMMENTS: మంత్రి హరీశ్‌రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ.. ఏపీపై విమర్శలు చేయడం సరికాదని ఆ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

'హరీశ్‌రావుకు, కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ..'

author img

By

Published : Sep 30, 2022, 7:13 PM IST

AP MINISTER AMARNATH ON HARISH RAO COMMENTS: ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాసను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌కు మధ్య గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి కానీ రాష్ట్రంపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. తెలంగాణకు ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావు జగన్‌ను తిడితే.. మేం ఇక్కడ కేసీఆర్‌ను తిడతాం అది చూసి హరీశ్‌ హ్యాపీగా ఫీలవుదామన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ క్రమంలోనే ఏపీలో ఉన్న పేదలకు ఎలాంటి సంక్షేమం అందుతుందో, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుందని అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం, వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏపీలో జరిగిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేటీఆర్‌ ఉదయం విమర్శ చేసి రాత్రికి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఏపీ భవన్‌లో అధికారిని హరీశ్‌రావు ఎలా తన్నారో అందరూ చూశారని మంత్రి అమర్‌నాథ్‌ అన్నారు.

హరీశ్‌రావుకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి. హరీశ్‌రావు జగన్‌ను తిడితే.. మేం ఇక్కడ కేసీఆర్‌ను తిడతాం అది చూసి హరీశ్‌ హ్యాపీగా ఫీలవుదామన్నట్టుగా ఉంది. తెరాసను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు లేదు. ఏపీలో ఉన్న పేదలకు ఎలాంటి సంక్షేమం అందుతుందో, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి ఇక్కడకు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం, వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏపీలో జరిగిన సంక్షేమం గురించి చెప్పాలి. - అమర్‌నాథ్‌, ఏపీ మంత్రి

'హరీశ్‌రావుకు, కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ..'

అసలేం జరిగిందంటే : ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వానికైనా వంద శాతం పనులను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి ఎలా లోపల వేస్తున్నారో.. తెరాస ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందో గమనించాలని సూచించారు. దేశంలోనే 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణదని కొనియాడారు.

ఇవీ చదవండి..:

ఏపీ ఉపాధ్యాయుల కష్టాలు మీరు చూస్తున్నారుగా... మంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు..

ఖర్గే X థరూర్ X త్రిపాఠీ​.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలుపెవరిదో?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.