గులాబ్ తుపాను ప్రభావం తెలంగాణపై (Gulab Cyclone Effect on Telangana) పడుతోంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (RED alert) ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
అలాగే ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు (orange alert) జారీ చేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు (heavy rains) కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు.
గులాబ్ పంజా
తెలంగాణపై గులాబ్ తుపాను(Cyclone Gulab Effect on Hyderabad) పంజా విసురుతోంది. దీని ప్రభావం(Cyclone Gulab Effect on Hyderabad)తో హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వాన నగర ప్రజలను భయపెడుతోంది. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు హైదరాబాద్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో హైదరాబాద్ పరిధిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. వరదలో చిక్కుకున్న వారు కంట్రోల్ రూం నంబర్ 040 23202813 కి కాల్ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: Cyclone Gulab Effect on Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. స్పెషల్ కంట్రోల్ రూమ్