కరోనా విజృంభిస్తున్న వేళ వైద్యులు మానసికంగా, శారీరకంగా గురయ్యే ఒత్తిడికి దూరమవడానికి క్రీడలు చాలా ఉపయోగ పడుతాయని అంతర్జాతీయ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని శ్రేష్ట మైదానంలో మైటీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో "డాక్టర్స్ క్రికెట్ లీగ్- సీసన్ 8" ఫైనల్ మ్యాచ్ జరిగింది.
రెనోవా, మెడికవర్ ఆస్పత్రుల జట్ల మధ్య చివరి మ్యాట్ జరగ్గా ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, క్రికెటర్ మిథాలీరాజ్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో రెనోవా జట్టు 109 పరుగులు చేయగా.. మెడికవర్ ఒకే వికెట్ కోల్పోయి 110 పరుగులు చేసి విజయం సాధించింది. విజేత, రన్నర్ జట్టులకు ట్రోఫీతో పాటు నగదు బహుమతిని అతిథులు అందచేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ మంజుల, మైటీ స్పోర్ట్స్ అధినేత నంద పాండేతో పాటు ఆస్పత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.