ETV Bharat / city

డ్రోన్​ దాడులపై ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు - telangana varthalu

ఛత్తీస్​గఢ్​ బీజాపూర్​ జిల్లాలో పోలీసులు డ్రోన్ల ద్వారా బాంబుదాడులు చేశారని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఈ దాడిలో అడవి జంతువులు, పక్షులు, ప్రకృతి వినాశనం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Maoists release statement on air strike
డ్రోన్​ దాడులపై ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు
author img

By

Published : Apr 22, 2021, 3:29 PM IST

ఈనెల 19న ఛత్తీస్​గఢ్​ బీజాపూర్ జిల్లాలోని బొత్తలంక-పాలగూడెం గ్రామ పరిసరాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేశారని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. ఇది దేశ చరిత్రలో ప్రజాఉద్యమాలపై, జనావాసాలపై జరిగిన మొదటి డ్రోన్​ దాడి అని వారు ఆరోపించారు. డ్రోన్​ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లను ఆకాశంలో గమనించి ప్రజా గెరిల్లాలు తప్పించుకున్నాయని తెలిపారు. దాడిలో అడవి జంతువులు, పక్షులు, ప్రకృతి వినాశనం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొవిడ్​ను అరికట్టడంతో అన్ని ప్రభుత్వాలు విఫలం అయ్యాయని మావోయిస్టులు ఆరోపించారు. దండకారణ్యం-బస్తర్​ను మోదీ, అమిత్ షాలు శత్రు దేశంగా భావిస్తున్నారని విమర్శించారు. దాడులకు వ్యతిరేకంగా ఏప్రిల్ 26న భారత్ బంద్​కు పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాలు, పార్టీలు, మేధావులు, కార్మికులు, రైతులు, విద్యార్ధులు ఈ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని మావోయిస్టులు సూచించారు.

Maoists release statement on air strike
డ్రోన్​ దాడులపై ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు
Maoists release statement on air strike
డ్రోన్​ దాడులపై ప్రకటన విడుదల చేసిన మావోయిస్టులు

ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.