ETV Bharat / city

TSPSC: నివేదికకు నాలుగేళ్లు... సంస్కరణలకు ఎన్నేళ్లు? - తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. రామకృష్ణయ్య కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా ప్రభుత్వ అనుమతి లభించలేదు. కీలకమైన సంస్కరణలు అమలు కాకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

tspsc
tspsc
author img

By

Published : Nov 7, 2021, 6:24 AM IST

ఒకే సిలబస్‌, ఒకే శిక్షణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడేలా ప్రతిపాదించిన ‘ఉమ్మడి సిలబస్‌’ రాష్ట్రంలో ఆమోదం పొందలేదు. యూపీఎస్సీ ఆమోదించినా, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామకృష్ణయ్య కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా ప్రభుత్వ అనుమతి లభించలేదు. దీంతో రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలకు వేర్వేరు శిక్షణ, సిలబస్‌ పుస్తకాల ఖర్చు, హాస్టళ్ల అద్దెలు, ఇతర ఖర్చులు భరించలేక ఆందోళన చెందుతున్నారు. నివేదిక ఆమోదం పొందకపోవడంతో ఉమ్మడి సిలబస్‌, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను కలుపుతూ తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఏర్పాటు, ఏటా ఉద్యోగ కేలండర్‌ ఆలోచనలు నిలిచిపోయాయి.

కమిటీ ఏం చెప్పింది...

ఉమ్మడి సిలబస్‌ను యూపీఎస్సీ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర నియామకాల్లో అమలు చేయాల్సిన సంస్కరణలపై ప్రభుత్వం రామకృష్ణయ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉమ్మడి సిలబస్‌తో పాటు పోటీ పరీక్షల్లో నిరుద్యోగులపై భారం తగ్గించేలా, యూపీఎస్సీతో సమానంగా టీఎస్‌పీఎస్సీలోనూ ఉద్యోగ ప్రకటనలు వెలువడేలా సిఫార్సులు చేసింది. నాలుగేళ్లవుతున్నా కీలకమైన సంస్కరణలు అమలు కాకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి సిలబస్‌, ఉద్యోగకేలండర్‌ను కేరళ, గుజరాత్‌ రాష్ట్రాలు సమర్థంగా అమలు చేస్తున్నాయి.

  • గ్రూప్‌-1, 2 ఉద్యోగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఏర్పాటు చేయాలి
  • ఈ పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ తరహాలో ర్యాంకులు ప్రకటించాలి.
  • యూపీఎస్సీ ఐపీఎస్‌, ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ ఇతర గ్రూప్‌-ఏ ఉద్యోగాల మాదిరి అభ్యర్థి పొందిన ర్యాంకుల ఆధారంగా గ్రూప్‌-1, 2 పోస్టులను కేటాయించాలి.
  • స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌, యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు ఒకటి లేదా రెండునెలల వ్యత్యాసం ఉండేలా చూడాలి. ఉమ్మడి సిలబస్‌తో రెండు ఉద్యోగాలకు పోటీపడవచ్చు.
  • గ్రూప్‌-3, 4 ఉద్యోగాలను స్టేట్‌ సెలక్షన్‌ కమిటీ ఉద్యోగాల కేటగిరీలోకి మార్చుతూ ఒకే పరీక్ష నిర్వహించాలి.
  • యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్సీలోనూ ఏటా ఉద్యోగ కేలండర్‌ అమలు చేయాలి.
  • పదవీ విరమణ చేయనున్న ఉద్యోగుల వివరాలను ఏడాదికి ముందుగానే తీసుకుని ఆ ఉద్యోగాల్ని నోటిఫై చేసి, ప్రకటనలు వెలువరించాలి.

ఎందుకీ సిలబస్‌..?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణ వాటా తక్కువగా ఉంటోందని గణాంకాలు చెబుతున్నాయి. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షల్లో ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. యూపీఎస్సీ-ఎస్‌ఎస్‌సీ, రాష్ట్రాల పీఎస్సీ సిలబస్‌లో భారీగా వ్యత్యాసం ఉంటోంది. అన్ని రాష్ట్రాల పీఎస్సీలు తమవద్ద ఇదే పరిస్థితి ఉన్నట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లో 2016లో జరిగిన యూపీఎస్సీ, పీఎస్సీల స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఉమ్మడి సిలబస్‌ ప్రాధాన్యాన్ని టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదించింది. ఒకే సిలబస్‌తో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాలకు పోటీపడేలా గ్రూప్‌-1, 2 స్థాయి ఉద్యోగాలకు, యూపీఎస్సీ ఉద్యోగాలకు 80 శాతం ఉమ్మడి సిలబస్‌... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 20 శాతం రాష్ట్ర సిలబస్‌ అమలు చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదన పరిశీలించిన యూపీఎస్సీ.. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని 2018లో గుజరాత్‌లో జరిగిన కమిటీ సమావేశంలో ఆమోదించింది. ఉమ్మడి సిలబస్‌తో నిరుద్యోగ అభ్యర్థులపై భారం తగ్గుతుందని సూచించింది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతున్నా... సిలబస్‌ను ప్రతిపాదించిన తెలంగాణ ఇప్పటికీ అమల్లో దూరంగా ఉంది.

ఇదీచూడండి: మానసిక సమస్యలతో విద్యార్థులు సతమతం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.