ETV Bharat / city

మానసిక సమస్యలతో విద్యార్థులు సతమతం..!

త్వరలో ప్రాథమిక తరగతులనూ ప్రత్యక్షంగా ప్రారంభించేందుకు ప్రైవేటు పాఠశాలలు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలనే ఉత్సాహం రేకెత్తించేదెలా? పాఠాలు వినేలా ప్రోత్సహించేదెలా? మళ్లీ విద్యార్థిని పూర్వస్థితికి తీసుకువచ్చేదెలా? తదితర వివరాలను మనస్తత్వ విశ్లేషకురాలు డాక్టర్‌ చల్లా గీత వివరించారు.

Students are suffering with mental problems

author img

By

Published : Nov 7, 2021, 5:33 AM IST

విద్యార్థి జీవితంలో ఏడాదిన్నరపాటు బడికి దూరమవడం చిన్న విషయమేమీ కాదు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ ఆన్‌లైన్‌ బాటపట్టడంతో అందరికీ ఇది అనుభవమైంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు/ఉపాధ్యాయుల పర్యవేక్షణలేక చాలామంది చదవడం, రాయడం, వినడం వంటి నైపుణ్యాలకు దూరమయ్యారు. ప్రస్తుతం మళ్లీ బడికి వెళ్తున్న నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరైతే తరగతి గదిలో ఏడెనిమిది గంటలు ఓపికగా కూర్చోవడానికే ఇబ్బంది పడుతున్నట్టు..చికాకు, కోపం, కారణం లేకుండా ఏడవడం వంటివి చేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. త్వరలో ప్రాథమిక తరగతులనూ ప్రత్యక్షంగా ప్రారంభించేందుకు ప్రైవేటు పాఠశాలలు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. పిల్లల్లో పాఠశాలకు వెళ్లాలనే ఉత్సాహం రేకెత్తించేదెలా? పాఠాలు వినేలా ప్రోత్సహించేదెలా? మళ్లీ విద్యార్థిని పూర్వస్థితికి తీసుకువచ్చేదెలా? తదితర వివరాలను మనస్తత్వ విశ్లేషకురాలు డాక్టర్‌ చల్లా గీత వివరించారు. సుదీర్ఘ కాలం ఆన్‌లైన్‌ తరగతులు నడచిన కారణంగా పిల్లలు అప్పటికప్పుడు లేచి జూమ్‌ తరగతులకు హాజరవుతూ వచ్చారు. ఈ క్రమంలో పొద్దున్నే నిద్రలేచే అలవాటుపోయింది. ఇప్పుడు పాఠశాలకు వెళ్లాలంటే కనీసం గంట, గంటన్నర ముందుగా లేచి సిద్ధమవ్వాలి. అంటే! ఉదయాన్నే నిద్రలేచేలా క్రమంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని తల్లిదండ్రులు ఆరంభించాలి. ఆరు రోజులపాటు నిర్దేశిత సమయంలో నిద్రలేచి సిద్ధమై బడికి వెళ్తే..ఆదివారం ఏదైనా పర్యాటక ప్రదేశానికి తీసుకెళ్తాననో/ఫలానా బహుమతి ఇస్తాననో చెప్పాలి. కచ్చితంగా ఆ హామీని నెరవేర్చాలి.

అల్పాహారం మరవొద్దు..

కొన్ని నెలలుగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తగ్గిపోయింది. అందువల్ల పిల్లలు ఇష్టంగా/ఆసక్తిగా తినే, తేలికగా జీర్ణమయ్యే ఆహారం సిద్ధంచేసి ఇవ్వాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలి.

వస్తువులు సర్దుకునేలా

ఏడాదిగా ఇంటికే పరిమితం కావడంతో మంచంపై కూర్చుని తినడం, వస్తువులు చెల్లాచెదురుగా పడేయడం అలవాటై ఉంటుంది. దీన్నుంచి దూరం చెయ్యాలి. పిల్లల వ్యవహారశైలిని తిరిగి గాడినపెట్టేందుకు ప్రయత్నించాలి.

మరుసటి రోజు వచ్చేలా...

ఇప్పటి పరిస్థితుల్లో బడి నుంచి ఇంటికెళ్లిన విద్యార్థి..మరుసటి రోజు అంతే ఉత్సాహంతో పాఠశాలకు వచ్చేలా చేయడం అత్యంత ప్రధానం. అందుకోసం కృత్యాధార బోధనను అనుసరించాలి. పేజీల కొద్దీ రాసే ఇంటిపని ఇవ్వకూడదు. వారికి సంతోషాన్నిచ్చే కథలు చెప్పడం, ఆటలాడించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

* మళ్లీ చదువుపై ధ్యాస పెంచడాన్ని షేపింగ్‌ టెక్నిక్‌గా పిలుస్తాం. ఈ విధానంలో బోధనలో దృశ్యాలను (విజువల్స్‌) ఎక్కువగా వాడాలి. గ్రాఫిక్స్‌, పోస్టర్ల సాయంతో పాఠాలు చెప్పాలి.

ఆరోగ్య సూత్రాలపై అవగాహన ముఖ్యం

రోగ్య భద్రతపై అవగాహన పెంచే బాధ్యతను తల్లిదండ్రులు/ఉపాధ్యాయులు తీసుకోవాలి. బడిలో మాస్కు తీసేయడం, వ్యక్తిగత దూరం పాటించకపోవడం వంటివి సరికాదని చెబుతూనే..వాటివల్ల కలిగే అనర్థాలనూ వివరించాలి.

ఎక్కువసేపు కూర్చోబెట్టడమే సవాలు

న్‌లైన్‌ తరగతులలో కూర్చుని/పడుకొని పాఠాలు వినేవారు. ఇప్పుడు ఏకబిగిన గంటల తరబడి తరగతి గదిలో కూర్చోలేక, పాఠాలపై ధ్యాస పెట్టలేకపోవచ్చు. దీన్నుంచి గట్టెక్కించేలా ఉపాధ్యాయులు వ్యవహరించాలి.

* కొన్ని రోజులపాటు తరగతి జరుగుతున్నప్పుడు మధ్యలో, తర్వాత కనీసం 5 నిమిషాల వ్యవధి ఇవ్వాలి.

* తరగతి గదిలో కుర్చీలో కూర్చోబెట్టే చిన్నచిన్న వ్యాయామాలు చేయించాలి.

* ఏకాగ్రత పెంచే పనులు(యాక్టివిటీస్‌) చేయించాలి.

* విద్యార్థులపై గతంలో ఉన్న అంచనాలను ఉపాధ్యాయులు తగ్గించుకోవాలి. పిల్లలు మళ్లీ పుంజుకునేవరకూ ఒత్తిడికిదూరంగా ఉంచాలి. ఆ దిశగా అన్ని అవకాశాలనూ వారికివ్వాలి.

* ముఖ్యంగా ఇతరులతో పోల్చడం మానుకోవాలి.

యాంత్రిక జీవనం నుంచి దృష్టి మళ్లించాలి

డాదిన్నర కాలంగా ఆన్‌లైన్‌/వర్చువల్‌ తరగతులతో పిల్లల జీవనశైలి మారిపోయింది. ఈ పరిస్థితుల్లో చదువు సంగతటుంచి ముందు పిల్లలను బడికి అలవాటుచేయడానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం మళ్లీ బడికి రప్పించే(వెల్‌కమింగ్‌ టెక్నిక్స్‌) పద్ధతులు పాటించాలి. మార్కుల ఆధారంగా కాకుండా, భావాలను వ్యక్తపరిచే బోధన పద్ధతులు అనుసరించాలి.

- ఎస్‌వీ నాగ్‌నాథ్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

ఇదీచూడండి: Prathidwani: గాయంచేసిన గత జ్ఞాపకాల నుంచి తప్పించుకోవడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.