హైదరాబాద్ బర్కత్‌పురలోని మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో 348వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు నిత్య అభిషేకాలు చేశారు. వివిధ రకాల పూలలో స్వామిని అలంకరించారు. మంగళ వాద్యాల నడుమ స్వామివారి మహా రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ రాంబాబు, పెద్దఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
ఇవీ చూడండి: యాదాద్రి ఆలయంలో వీహెచ్ ప్రత్యేక పూజలు