రాష్ట్రంలో ఒకలా.. దిల్లీలో మరోలా కేసీఆర్ వ్యవహారిస్తున్నాడని కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం జైలుకు వెళ్లకుండా ఉండేందుకు .. రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
జైలుకు ఎప్పుడు పంపిస్తారు..
బండి సంజయ్ చెప్పినట్లుగా భాజపా కేసీఆర్‌ను జైలుకు ఎప్పుడు పంపిస్తారో చెప్పాలని మల్లు కోరారు. సీఎం ద్వంద్వ వైఖరిని తప్పుపట్టిన ఆయన.. కేసీఆర్ తుగ్లక్ని మరిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు.