ETV Bharat / city

అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలమే: తలసాని

author img

By

Published : Feb 20, 2021, 8:40 PM IST

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ను మహంకాళి ఆలయ అర్చకులు సన్మానించారు. పెండింగ్​లో ఉన్న తమ వేతనాలు ఇప్పించినందుకు... కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని మంత్రి తెలిపారు.

mahankali temple priests felicitated minister thalasani srinivas yadav
అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలమే: తలసాని

అర్చకుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహంకాళి ఆలయ అర్చకులు వేణుమాధవ శర్మ, రామక్రిష్ణ శర్మ... వెస్ట్​మారేడ్​పల్లిలోని ఆయన నివాసంలో మంత్రిని సన్మానించారు. వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

ఇటీవల మంత్రిని కలిసినప్పుడు తమకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. స్పందించిన మంత్రి... దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించారు. మంత్రి చొరవతోనే తమకు వేతనాలు మంజూరయ్యాయని అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: మహీంద్రా మెచ్చిన 'ముద్దు' వీడియో ఇది!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.