ETV Bharat / city

Madhu Yashki Goud : 'తెలంగాణ పోలీసుల తీరు నిరంకుశ ధోరణికి నిదర్శనం' - madhuyaski about jung siren rally

విద్యార్థి, నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ ర్యాలీ(Congress Jung Siren Rally) నిర్వహించాలనుకుంటే.. అనుమతివ్వకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్(Madhu Yashki Goud) మండిపడ్డారు. భాజపా, తెరాస విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ ర్యాలీ(Congress Jung Siren Rally) జరుగుతుందని స్పష్టం చేశారు.

Madhu Yashki Goud
Madhu Yashki Goud
author img

By

Published : Oct 2, 2021, 2:21 PM IST

'తెలంగాణ పోలీసుల తీరు నిరంకుశధోరణికి నిదర్శనం

శాంతియుతంగా తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ(Congress Jung Siren Rally)కి ప్రభుత్వం అనుమతించకపోవటం నిరంకుశధోరణికి నిదర్శనమని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ గౌడ్‌(Madhu Yashki Goud) పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని.... నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు 'జంగ్ సైరన్(Congress Jung Siren Rally)' చేపట్టినట్లు చెప్పారు. తమ పార్టీ చెందిన కార్యకర్తలను, యువకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని... ఇది సరైన చర్య కాదన్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.... తమ ర్యాలీ(Congress Jung Siren Rally) కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.

"జంగ్ సైరన్ ర్యాలీ(Congress Jung Siren Rally)ని శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పాం. అయినా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. విద్యార్థి సంఘాల నేతలు, కాంగ్రెస్ నాయకుల్ని అరెస్టు చేశారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హింసను కోరుకోదు. ప్రోత్సహించదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి, నిరుద్యోగుల కోసం చేస్తున్న ఈ పోరాటం(Congress Jung Siren Rally)లో పాల్గొనడానికి ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముందుకొస్తుంటే.. వాళ్లని భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్టు చేస్తున్నారు. ఇది కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు.. రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు."

- మధుయాస్కీ(Madhu Yashki Goud), పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్

పోలీసులు బలగాలతో జంగ్ సైరన్ ర్యాలీ(Congress Jung Siren Rally)ని ఆపడానికి ప్రయత్నిస్తే ఉద్యమం ఉద్ధృతం అవుతుందని మధుయాస్కీ(Madhu Yashki Goud) అన్నారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి విద్యార్థులు, నిరుద్యోగులు తరలిరావాలని కోరారు. భాజపా, తెరాసలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. ఈ ర్యాలీ(Congress Jung Siren Rally)ని అడ్డుకుంటే పోలీసులు చారిత్రక తప్పిదం చేసినట్లేనని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్(telangana chief minister KCR).. గడి పాలన కొనసాగించాలనుకుంటే.. ప్రజలు గద్దె దించుతారని మధుయాస్కీ(Madhu Yashki Goud) జోస్యం చెప్పారు. ప్రజలు కేసీఆర్​(telangana chief minister KCR)ను రాజకీయంగా పాతరపెడతారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు. ఈ హక్కును కాలరాసే హక్కు ప్రభుత్వాలకు లేదని స్పష్టం చేశారు. వెంటనే తమ ర్యాలీ(Congress Jung Siren Rally)కి అనుమతిస్తూ.. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను, కాంగ్రెస్ నేతలను విడుదల చేయాలని మధుయాస్కీ(Madhu Yashki Goud) డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.