Nara Lokesh fires on ycp: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థల విధ్వంసానికి సీఎం జగన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. పల్లె పోరులో ఫ్యాన్‌కు ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి.. ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి విద్యుత్ బకాయిలంటూ.. రూ.345 కోట్లు నిలిపేశారని ఆరోపించారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లను.. ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టించడం గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చెయ్యడమేనని మండిపడ్డారు.
-
వ్యవస్థల విధ్వంసానికి @ysjagan బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు.రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా..(1/3) pic.twitter.com/JbfD3Wh0Xh
— Lokesh Nara (@naralokesh) November 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వ్యవస్థల విధ్వంసానికి @ysjagan బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు.రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా..(1/3) pic.twitter.com/JbfD3Wh0Xh
— Lokesh Nara (@naralokesh) November 23, 2021వ్యవస్థల విధ్వంసానికి @ysjagan బ్రాండ్ అంబాసిడర్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారు.రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా..(1/3) pic.twitter.com/JbfD3Wh0Xh
— Lokesh Nara (@naralokesh) November 23, 2021
15వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులతో.. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరువాత.. ఖాతాల్లో సొమ్ము సున్నా అయితే వారు ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం మళ్లించిన సొమ్ముని పంచాయతీల ఖాతాల్లో జమచెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: AP high court serious: అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. రేపే ఎన్నిక నిర్వహించాలని ఆదేశం