ETV Bharat / city

ఎంపీ అర్వింద్​కు లోక్​సభ స్పీకర్​ ఫోన్​.. వెంటనే దిల్లీ రావాలని సూచన.. - ఎంపీ అర్వింద్​కు ఫోన్

Lok Sabha Speaker Phone to Arvind: ఇటీవల నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో జరిగిన దాడి విషయం తెలిసిన లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాష్​ బిర్లా.. ఎంపీ అర్వింద్​కు ఫోన్​ చేశారు. దాడి గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే దిల్లీకి రావాలని పిలిచారు.

Lok Sabha Speaker om prakash birla Phone to MP Arvind about armoor attack

author img

By

Published : Jan 28, 2022, 8:00 PM IST

Lok Sabha Speaker Phone to Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​కు లోక్​సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్​లో ఎంపీపై జరిగిన తెరాస కార్యకర్తల దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి ఎలా జరిగింది..? పోలీసులు వ్యవహరించిన తీరును స్పీకర్​కు ఎంపీ అర్వింద్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై పోలీసుల సహకారంతో హత్యయత్నం చేసిందని స్పీకర్​కు తెలిపారు. వెంటనే దిల్లీకి రావాలని అర్వింద్​కు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చెప్పారు. మరో రెండు రోజుల్లో దిల్లీకి వెళ్లి లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. అర్వింద్​కు ఫోన్​ చేసి దాడి గురించి తెలుసుకున్నారు.

దాడిపై గవర్నర్​కు ఫిర్యాదు..

Aravind Complaint to Governor: ఆర్మూర్​లో తనపై జరిగిన దాడి గురించి ఇప్పటికే గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు ఎంపీ అర్వింద్​ ఫిర్యాదు చేశారు. సొంత నియోజకవర్గంలో పోలీసులు తనకు కనీస భద్రత కల్పించలేదని ఎంపీ తెలిపారు. నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్ పర్యవేక్షణలో తన హత్యకు ప్రణాళిక జరిగిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దాడి ఘటనపై తనను గవర్నర్ తమిళిసై ఫోన్ చేయగా.. వివరాలు తెలిపారు. దాడి జరిగే అవకాశం ఉందని ముందు రోజు, మరుసటి రోజు తెలిపినా.. రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం చేయలేదని గవర్నర్‌కు చెప్పారు.

ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్ల దాడి..

TRS attack on MP Arvind : నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలం ఇస్సపల్లి వద్ద ఎంపీ అర్వింద్ వాహనంపై దాడి జరిగింది. ఎంపీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎంపీ వాహనంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తల వాహనాలు దాడిలో ధ్వంసం కాగా.. పలువురు గాయపడ్డారు. ఐదారు వాహనాలతో పాటు ఆరుగురి కార్యకర్తల చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. పలువురికి చేతులు విరిగిపోయాయి. దాడి గురించి పూర్తి కథనం కోసం క్లిక్​ చేయండి..

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.