ETV Bharat / city

కట్టడి ఆంక్షలతో చిరువ్యాపారులకు కష్టాలు

కోలుకున్నాం అనుకునేలోపే చిరువ్యాపారులపై లాక్‌డౌన్‌ పిడుగులా పడింది. రెండేళ్లుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న కష్టజీవులు.. మరోమారు కష్టాల్లో కూరుకుపోతున్నారు. కట్టడి ఆంక్షలు వారి ఉపాధిని తీవ్రంగా దెబ్బకొడుతున్నాయి.

small traders, lock down effect on small traders
చిరువ్యాపారులు, చిరువ్యాపారులపై లాక్​డౌన్ ఎఫెక్ట్
author img

By

Published : May 16, 2021, 9:24 AM IST

లాక్​డౌన్ వల్ల మూడు రోజులుగా వ్యాపారం జరగక, తెచ్చుకున్న సరకును కాపాడుకోలేక చిరువ్యాపారులు అవస్థలుపడుతున్నారు. ఇప్పటి వరకు ఒక లక్ష మంది నష్టపోయారని అంచనా. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాగ్యనగరంలోని 1.6లక్షల మంది చిరువ్యాపారులు రోడ్డున పడతారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వల్పకాల ఆంక్షల సడలింపు వ్యాపారం చేయాలనే ఆశ కలిగిస్తూనే.. భంగపాటుకు గురి చేస్తోందని గుర్తుచేస్తున్నారు.

ప్రారంభించేలోపే మూసివేసే పరిస్థితి

సర్కారులాక్‌డౌన్‌ ఆంక్షలను ఉదయం 6గ-10గ మధ్య సడలించింది. ఆ సమయంలో చిరు వ్యాపారులు రోడ్డెక్కుతున్నారు. దగ్గర్లోని మార్కెట్లకు వెళ్లి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలు, పండ్ల కోసం బోయిన్‌పల్లి, ఎన్టీఆర్‌నగర్‌, మాదన్నపేట, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, ఎర్రగడ్డ, కొత్తపేట తదితర రైతుబజార్లు, మార్కెట్లకు వెళ్తారు. అక్కడి నుంచి సరకుతో కాలనీలకు చేరుకునేలోపే రెండు గంటలు పూర్తవుతుంది. మరో రెండు గంటల్లో వ్యాపారం ఆపేసి ఇంటికెళ్లాల్సి వస్తోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో మరుసటి రోజుకు సరకులు పాడవుతుండడంతో అమ్ముడుపోవట్లేదు. ఆ కారణంతో జనం దగ్గర్లోని సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్సులను ఆశ్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌ మొబైల్‌ అప్లికేషన్లలో ఆర్డర్లు ఇచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌ రెండో రోజుకే గ్రోఫర్స్‌, బిగ్‌బాస్కెట్‌, ఇతరత్రా అప్లికేషన్లలో వారం రోజుల వరకు వస్తువులను అందించే స్లాట్లు బుక్కైపోవడం గమనార్హం.

సాయంత్రం వరకు అవకాశమివ్వాలి

వీధులు, కాలనీల్లో తిరుగుతూ తోపుడు బండ్లు, ఆటోల్లో కూరగాయలు, పండ్లను సాయంత్రం వరకు విక్రయించుకునే అవకాశం కల్పించాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. తమతోపాటు నగరానికి తీసుకొచ్చిన పంటను పూర్తిగా, గిట్టుబాటు ధరకు అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేస్తున్నారు.

కష్టంగా కుటుంబ పోషణ

మా కుటుంబం 15 ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేస్తోంది. కొత్తపేట నుంచి పండ్లు తీసుకొస్తూ కొంత కాలం క్రితం భర్త మరణించారు. సీజన్‌లో రోజూ వెయ్యి రూపాయలు మిగిలేవి. ఇప్పుడు సరకు అమ్ముడవట్లేదు. మార్కెట్‌ నుంచి పండ్లు తీసుకొచ్చేందుకే సమయం ముగుస్తోంది. రూ.200లు కూడా గిట్టుబాటు కావట్లేదు. కుటుంబ పోషణ కష్టంగా మారింది.

- నాగలక్ష్మి, ఎన్‌ఎఫ్‌సీ కాలనీ

అద్దె కట్టలేక పోతున్నాం

తల్లిదండ్రులపై వయోభారం పడటంతో వారి వ్యాపారాన్ని నేను నడిపిస్తున్నా. బోయిన్‌పల్లి మార్కెట్‌ నుంచి కూరగాయలను దుకాణం వద్దకు తీసుకొచ్చేలోపే 8గంటలు అవుతుంది. 10గంటల వరకు అమ్మితే పదో వంతు సరకు కూడా అమ్ముడవట్లేదు. వచ్చే రూ.300లలో కూరగాయల స్టాండు అద్దెకు సగం ఖర్చవుతుంది. మరుసటి రోజుకు ఆకుకూరలు, కూరగాయలు మగ్గిపోతున్నాయి.

- ఆనంద్‌కుమార్‌, కూరగాయల వ్యాపారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.