ETV Bharat / city

జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం - telangana latest news

జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై చర్చించేందుకు... స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు హైదరాబాద్​లో సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిసి విన్నవించాలని నిర్ణయించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీల సమస్యలపై స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సమావేశం

author img

By

Published : Feb 14, 2021, 5:16 PM IST

Updated : Feb 14, 2021, 5:29 PM IST

జడ్పీటీసీలు, ఎంపీటీసీల విజ్ఞప్తులు, సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానికసంస్థల ఎమ్మెల్సీలు దృష్టి సారించారు. ఈ మేరకు స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన శాసనమండలి సభ్యులు హైదరాబాద్​లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నిధులు, విధులకు సంబంధించిన అంశాలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్​ను త్వరలో కలిసి వినతిపత్రాలు అందించాలని ఎమ్మెల్సీలు నిర్ణయించారు.

ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, భానుప్రసాదరావు, ఎమ్మెల్సీలు కవిత, మహేందర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, సతీశ్ కుమార్, తేరా చిన్నపరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శంబీపూర్ రాజు, బాలసాని లక్ష్మీనారాయణ హాజరయ్యారు.

ఇదీ చూడండి: 'తెరాస సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి'

Last Updated : Feb 14, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.