ETV Bharat / city

తెగ తాగేశారు: 2020లో మద్యం అమ్మకాల ఆల్​టైమ్ రికార్డు - తెలంగాణలో మద్యం అమ్మకాలు

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. కొవిడ్‌ మూలంగా నెలన్నర రోజులు మద్యం దుకాణాలు మూసివేసినా... 2020లో రూ. 25వేల కోట్లకుపైగా విలువైన మద్యాన్ని రాష్ట్ర ప్రజలు తాగేశారు. ఏడాది కాలంలో 3.25 కోట్ల కేసుల లిక్కర్‌, 2.93 కోట్ల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

liquor sales in 2020 year in telangana
liquor sales in 2020 year in telangana
author img

By

Published : Jan 1, 2021, 7:25 PM IST

కొవిడ్‌ మూలంగా దేశ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి. రాబడులు లేక అనేక సంస్థలు మూతపడ్డాయి. అయినా... రాష్ట్రంలో మాత్రం అబ్కారీ శాఖ ప్రభుత్వానికి కాసులు వర్షం కురిపించింది. కొవిడ్‌ మూలంగా 2020 మార్చి చివరి వారం నుంచి అన్ని వ్యవస్థలతోపాటు మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్‌లు, క్లబ్‌లు మూతపడ్డాయి. 45 రోజులపాటు మద్యం అమ్మకాలకు విరామం వచ్చినా... ఆ ప్రభావం మద్యం అమ్మకాలపై కనిపించలేదు. 2020లో మద్యం అమ్మకాల పరిమాణం బాగా తగ్గినా... రాబడి మాత్రం పెరిగింది. లిక్కర్‌పై 20శాతం, బీరుపై యాభై రూపాయలు ధర పెరగడమే ఇందుకు కారణమని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు.

3వేల కోట్లు అదనం...

2019 జనవరి నుంచి డిసెంబరు 31 వరకు రూ.22,145 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా... 2020లో ఇదే సమయంలో రూ. 25,601 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. 2019 ఏడాదిలో 3.54 కోట్ల కేసుల లిక్కర్‌, 5.20 కోట్ల కేసుల బీరు అమ్ముడుపోయింది. 2020లో 3.25 కోట్ల కేసుల లిక్కర్‌, 2.93 కోట్ల కేసుల బీరు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది. 29 లక్షల కేసుల లిక్కర్‌, 2.27 కోట్ల కేసుల బీరు విక్రయాలు అంతకుముందు ఏడాది కంటే తగ్గాయి. ధరల పెంపుతో మద్యం అమ్మకాల ద్వారా దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ ఖజానాకు చేకూరింది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనట్లు రూ.25,601 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగడం... రికార్డు బ్రేక్‌గా ఎక్కైజ్‌ శాఖ అంచనా వేస్తోంది.

మందుబాబులు పెరుగుతున్నారు...

రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన మద్యం అమ్మకాలను ఒకసారి పరిశీలించినట్లయితే... హైదరాబాద్‌ రూ.2,687 కోట్లు, రంగారెడ్డి రూ. 5,570.69 కోట్లు, మెదక్‌ రూ.2,001.98 కోట్లు, నల్గొండ రూ.2,844.55 కోట్లు, వరంగల్‌ రూ.2,150.22 కోట్లు, మహబూబ్‌ నగర్‌లో రూ.1924.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1852.71 కోట్లు, కరీంనగర్‌ రూ. 1810.52 కోట్లు, అదిలాబాద్‌లో రూ.1459.79 కోట్లు, నిజామాబాద్‌లో రూ1,268.43 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయని అబ్కారీ శాఖ వెల్లడించింది. ఏటికేడు రాష్ట్రంలో మద్యం ప్రియుల సంఖ్య పెరుగుతోందని అమ్మకాలు జరిగిన తీరు స్పష్టం చేస్తోంది.

ఏటికేడు పెరగటమే...

కొవిడ్‌ మూలంగా 45 రోజులపాటు మద్యం అమ్మకాలు అగిపోనట్లయితే మరో నాలుగు వేల కోట్లు విలువైన మద్యం అమ్మకాలు అదనంగా జరిగేవని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా... ఎక్సైజ్‌ శాఖ నుంచి ప్రభుత్వానికి వస్తున్న రాబడులు ఏటికేడు పెరుగుతున్నాయని ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: మద్యం మానేద్దాం.. 2021ని హాయిగా గడిపేద్దాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.