ETV Bharat / city

'కోర్టులో చోరీ... మంత్రి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసు పత్రాలు మాయం'

Theft In Court Nellore: నెల్లూరు న్యాయస్థానంలో ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన పత్రాలు చోరీకి గురకావటంపై న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే మాయం కావడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Theft In Court Nellore:
Theft In Court Nellore:
author img

By

Published : Apr 16, 2022, 5:19 PM IST

Theft In Court Nellore: నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. సాక్షాత్తూ కోర్టులోనే చోరీ జరిగితే ఇంకెవరికి చెప్పుకోవాలని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన తీరుపైనా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన ముద్దాయిగా ఉన్న కేసుకు సంబంధించిన పత్రాలు మాత్రమే మాయం కావడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగల బారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని నినాదాలు చేశారు. సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

"ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అనామక దొంగలను కాదు.. చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలి. కాకాణి మొదటి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైంది. వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి చోరీ జరగలేదు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్య. కోర్టులోనే చోరీ జరిగితే.. ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలి? ఆలీబాబా 40 దొంగలు మాదిరిగా ఉంది ఈ ప్రభుత్వ వ్యవహారం." - న్యాయవాదులు

ఏం జరిగిందంటే..: నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈనెల 13న అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఓ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన వాటిని కాలువలో పడేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మధ్య నడుస్తున్న ఫోర్జరీ సంతకాల కేసుకు సంబంధించిన పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది.

పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు: దేశచరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా కోర్టులో దొంగలు పడటం.. అదీ ఓ కీలకమైన కేసులో ఆధారాలుగా ఉన్నపత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగిలించడంతో నెల్లూరు పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాజకీయ ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ విజయారావు నేరుగా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. కీలకపత్రాలు ఎక్కడున్నాయి ? ఎక్కడి నుంచి దొంగిలించారనే వివరాలు తెలుసుకున్నారు. కేసు చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలోనిది కావడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన ఇన్‌స్పెక్టరు మధుబాబును రంగంలోకి దించారు. కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల కేసును ఛేదించడం కష్టమైనా కోర్టుకు వెళ్లే దారిలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

ఈనెల 13న (బుధవారం) అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్యలో.. దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ పాత నేరస్థులేనని తెలుస్తోంది. రెండు నెలల కిందట రాయాజీవీధిలో జరిగిన ఓ చోరీ కేసులో వీరు నిందితులు. ఓ వృద్ధురాలిని కట్టేసి బంగారు నగలు దొంగిలించారు. అప్పట్లో వీరిపై దోపిడీ కేసు కాకుండా నామమాత్రపు కేసు నమోదు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కోర్టులో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. బండిపై ఉల్లిపాయలు విక్రయించే వారిద్దరూ...స్నేహితులేనని సమాచారం. త్వరలోనే పోలీసులు కేసు పూర్వాపరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చెప్పు దెబ్బలు కొట్టిన మహిళా సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.