ETV Bharat / city

Chetana Foundation: పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ చేయూత - కోనేరు కోనప్ప తాజా వార్తలు

Chetana Foundation: పేద విద్యార్థులను ఎంపిక చేసి సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగు పర్చేందుకు... చేతన ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని శేర్​లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ల్యాప్​టాప్​లను అందజేశారు.

Chetana Foundation
Chetana Foundation
author img

By

Published : May 9, 2022, 11:02 AM IST

Chetana Foundation: చేతన ఫౌండేషన్ ఛైర్మన్ రవి 8 దేశాలలో సంస్థ సేవలను కొనసాగించడం సంతోషంగా ఉందని శేర్​లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నివాసంలో సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కోనేరు కోనప్పతో కలిసి 20 మంది పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ ప్రతినిధులు ల్యాప్​టాప్​లు పంపిణీ చేశారు.పేద విద్యార్థులకు చదువుల్లో చేయుతనివ్వాలనే సంకల్పంతో చేతన ఫౌండేషన్ ల్యాప్​టాప్​లు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

విపత్కర కొవిడ్ సమయంలోనూ పేద విద్యార్థులను ఎంపిక చేసి వారిలో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే వెయ్యి ల్యాప్​టాప్​లు విద్యార్థులకు అందజేశారని ఎమ్మెల్యేలు తెలిపారు. వారి సహాయ సేవలు ప్రశంసనీయమని శాసనసభ్యులు కొనియాడారు. నిరుపేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

పేద విద్యార్థులకు చేతన ఫౌండేషన్ చేయూత

ఇదీ చదవండి:Harish Rao Review: 'వైద్యులు ఉ.9 నుంచి సా.4 వరకు అందుబాటులో ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.