KTR on TRS Plenary: సామాన్య, మధ్యతరగతి ఆంకాంక్ష ప్రతిబింభించేలా తెరాస ప్లీనరీ ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం 11 తీర్మానాలు రూపొందించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో స్పష్టంగా చెబుతామని అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తామని వెల్లడించారు. కేసీఆర్ తిరిగి హ్యాట్రిక్ కొట్టి మూడోసారి పరిపాలన పగ్గాలు చేపట్టాలనే గులాబీ శ్రేణుల ఆకాంక్షకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటామని పేర్కొన్నారు. రేపు హెచ్ఐసీసీలో జరిగే తెరాస ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ పరిశీలించారు.
తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం హెచ్ఐసీసీలో రాష్ట్ర ప్రతినిధుల మహాసభ జరగనుంది. ఉదయం పది గంటలకు జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రివర్గం, రాజ్యసభ, లోక్‌సభల సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేలమందికి ఆహ్వానం పంపించారు. పురుషులు గులాబీరంగు దుస్తులు, మహిళలు అదే రంగు చీరలతో హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధుల నమోదు... 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పతాకావిష్కరణ చేస్తారు. తర్వాత తెలంగాణ తల్లికి, అమరవీరులకు నివాళి అర్పించి... అనంతరం స్వాగతోపన్యాసం ఉంటుంది.
ఇదీ చదవండి : వంట, నిద్ర, డ్రైవింగ్, షాపింగ్.. ఏ పనికి ఎన్ని కేలరీలు ఖర్చు?