KTR Participated in Schneider Electric Factory Ceremony: తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసేందుకు ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్ ముందుకొచ్చింది. ష్నైడర్ ఎలక్ట్రిక్ కొత్త స్మార్ట్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్... సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏడాది లోపే తమ నూతన ఫ్యాక్టరీ ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది.
స్మార్ట్ మ్యానుఫ్యాక్టరింగ్ కోసం ప్రభుత్వంతో కలిసి స్థానిక యువతకు శిక్షణనివ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్... ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ ష్నైడర్‌ను కోరారు. దేశంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. స్మార్ట్ మ్యానుఫ్యాక్టరింగ్‌లో స్థానిక యువతకు శిక్షణనిస్తే... ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఒకే రోజు రాష్ట్రంలో 3 ఫ్రెంచ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని... ఇది సంతోషించే విషయంగా మంత్రి పేర్కొన్నారు. 75% ష్నైడర్ ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. మరిన్ని ఫ్రెంచ్ సంస్థలు హైదరాబాద్ లో వ్యాపారాన్ని ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్‌ని ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు.
'దేశంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీని ష్నైడర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుంది. 75 శాతం ష్నైడర్ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఏడాదిలోపే సంస్థ తమ నూతన ఫ్యాక్టరీ ప్రారంభించనుంది. స్మార్ట్ తయారీ కోసం ప్రభుత్వంతో కలిసి శిక్షణ ఇవ్వాలని ష్నైడర్‌ని కోరుతున్నాను. ఫలితంగా ష్నైడర్‌తో పాటు స్థానిక యువతకు ఉపయోగకరం. ఒకే రోజు రాష్ట్రంలో 3 ఫ్రెంచ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. ఇది సంతోషించే విషయం.'-కేటీఆర్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
ఇవీ చదవండి: