KTR Davos Tour: దావోస్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే.. మంత్రి కేటీఆర్‌ను దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై వారిద్దరూ చర్చించారు. తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా వంటి రంగాల్లో సాధిస్తున్న పురోగతిపైన చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య థాకరే ఆసక్తి చూపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం, మున్సిపల్, పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించడం వంటి కీలకమైన సంస్కరణలను కేటీఆర్.. ఆదిత్య థాకరేకు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలపై మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ వస్తానని ఆదిత్య థాకరే తెలిపారు. వాటితో పాటు మహారాష్ట్రలో పట్టణ అభివృద్ధిలో చేపట్టిన పలు అంశాలపైన ఆదిత్య థాకరే.. కేటీఆర్‌కి వివరాలు అందించారు. పరస్పరం కలిసి పనిచేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
-
Pleasure meeting with the youthful & dynamic @AUThackeray Ji
— KTR (@KTRTRS) May 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Discussed wide range of issues on how Telangana & Maharashtra can work together. Stronger the states, stronger the country pic.twitter.com/E66FJneXD3
">Pleasure meeting with the youthful & dynamic @AUThackeray Ji
— KTR (@KTRTRS) May 24, 2022
Discussed wide range of issues on how Telangana & Maharashtra can work together. Stronger the states, stronger the country pic.twitter.com/E66FJneXD3Pleasure meeting with the youthful & dynamic @AUThackeray Ji
— KTR (@KTRTRS) May 24, 2022
Discussed wide range of issues on how Telangana & Maharashtra can work together. Stronger the states, stronger the country pic.twitter.com/E66FJneXD3
ఇవీ చదవండి: రేవంత్.. నీ బిడ్డ పెళ్లికి నేనే పైసలిచ్చిన..: మల్లారెడ్డి