Protest at Anandaiah House: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో.. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇంటి వద్ద గ్రామస్థులు నిరసన చేపట్టారు. ఒమిక్రాన్‌కు మందు తయారీ ప్రకటనపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ మందు శాస్త్రీయతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒమిక్రాన్ మందుపై ఆనందయ్య ప్రకటనతో అనేక మంది వ్యాధిగ్రస్థులు గ్రామానికి వస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
పూర్తి స్థాయిలో నివేదికలు లేకుండా మందు తయారు చేసినట్లు ప్రకటించడం సరికాదని ఉప సర్పంచ్ పేర్కొన్నారు. వివిధ రకాల వ్యాధిగ్రస్థులు గ్రామంలోకి వస్తుండటంతో తమకూ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆనందయ్య.. కోర్టు నుంచి నివేదిక రాగానే వివరణ ఇస్తానని తెలిపారు.
ఇదీచదవండి: Harish Rao on Booster dose: 'మనమే ముందున్నాం.. బూస్టర్ డోసుకు అన్ని ఏర్పాట్లు చేయాలి'