ETV Bharat / city

త్రికోటేశ్వరుడి తిరునాళ్లకు.. 'ప్రభ'వించేనా? - కోటప్పకొండ తిరునాళ్లు గుంటూరు జిల్లా

కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభల వెలుగులకు ఈసారి పోలీసులు ఆంక్షలు విధించారు. శివరాత్రి సందర్భంగా ప్రభలు కట్టొద్దని హెచ్చరిస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రభలతో ఊరేగింపుగా వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది. ఐతే ఎన్నికల కోడ్, కరోనా పేరిట ఈసారి ప్రభలను అనుమతించబోమని పోలీసులు చెప్పటం వివాదంగా మారింది. త్రికోటేశ్వరస్వామి భక్తులతో పాటు... తెదేపా, భాజపా నేతలు పోలీసుల తీరుని తప్పుబడుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

kotappakonda
త్రికొటేశ్వరుడి తిరునాళ్లకు.. 'ప్రభ'వించేనా?
author img

By

Published : Feb 27, 2021, 8:11 AM IST

త్రికొటేశ్వరుడి తిరునాళ్లకు.. 'ప్రభ'వించేనా?

ఏపీలోని గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో ఈసారి ప్రభల వెలుగులు కనిపించడం అనుమానమే. శివరాత్రి పురస్కరించుకుని ప్రభలు కట్టవద్దని పోలీసులు గ్రామాల్లోకి వెళ్లి హెచ్చరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌, కరోనా పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసుల నిర్ణయం త్రికోటేశ్వరస్వామి భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు పలు గ్రామాల నుంచి ఏటా ప్రభలు రావడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం కొన్ని తరాలుగా వస్తోంది.

ప్రభలదే ప్రధాన ఆకర్షణ

తిరునాళ్లలో ప్రభలదే ప్రధాన ఆకర్షణ. 50 నుంచి 100 అడుగుల ఎత్తులో ఉండే విద్యుత్తు ప్రభలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెలుగులీనుతూ కనిపిస్తాయి. తిరునాళ్లకు ముందురోజే ప్రభలు గ్రామాల నుంచి బయలుదేరతాయి. అవి కొండకు చేరే మార్గంలో విద్యుత్తు తీగలు అడ్డు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున అసలు ప్రభలు వద్దనేది పోలీసు వర్గాల వాదన. అయితే గ్రామాల్లో పంచాయతీ పోరు ముగిసినందున అక్కడ కోడ్‌ ఉండదు. అలాగే నరసరావుపేట మున్సిపాలిటీ అయినా అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కాబట్టి కోడ్‌ ప్రస్తావన రాదు. మరి ప్రభలు వద్దనడానికి అసలు కారణాలు మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు.

మా పని మేం చేసుకుపోతాం

కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టడానికి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రభలు కట్టడం తరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయం. తిరునాళ్ల సందర్భంగా ప్రభలు కట్టడాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. - కన్నాలక్ష్మినారాయణ, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు.

భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయొద్దు

శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు వస్తారు. ప్రభలు కట్టకుండా నిలువరించి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయొద్ధు ఊరేగింపు వద్ద పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలపై సూచనలు చేయండి. వాటిని అమలు చేయండి. అంతేగాని ప్రభలు కడితే కేసులు పెడతామని బెదిరించడం సరికాదు. తెదేపా వారు ఎక్కువగా ప్రభలు కడుతున్నారనే అడ్డుకుంటున్నారు. - ప్రత్తిపాటి పుల్లారావు, మాజీమంత్రి.

తరాల సంప్రదాయాన్ని కాదనొద్దు

కోటప్పకొండ ప్రభలలో పురుషోత్తంపట్నం అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి 12 ప్రభలు ఒకేసారి బయలుదేరి వెళ్తాయి. మా పూర్వీకుల నుంచి ఈ ప్రభలు క్రమం తప్పకుండా కడుతున్నాం. కొండకు వెళ్తున్నాం. ఊరంతా ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ ఏడాది కూడా అదే విధంగా ముందుకు సాగుతాం. - బైరా వెంకట కోటేశ్వరరావు, ప్రభ నిర్వాహకుడు, పురుషోత్తంపట్నం .

ప్రభలపై కొందరు రాజకీయ పార్టీల నేతల ఫొటోలు, గుర్తులు కూడా ఉంచుతారు. ప్రస్తుతం మున్సిపాలిటి ఎన్నికల కోడ్ ఉన్నందున అసలు ప్రభలు వద్దనేది పోలీసువర్గాల వాదన. అయితే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసినందున అక్కడ కోడ్ ఉండదు. అలాగే నరసరావుపేట మున్సిపాలిటి అయినా.. అక్కడ ఎన్నికలు జరగటం లేదు. కాబట్టి కోడ్ ప్రస్తావన రాదు. మరి ప్రభలు ఎందుకు వద్దనే అసలు కారణాలు మాత్రం పోలీసులు చెప్పడం లేదు.

ఇదీ చదవండి: ప్రజా ప్రతినిధుల కోసం ఎదురుచూస్తున్న గ్రామాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.