ఆర్టీసీకి ఏర్పడిన నష్టం ప్రభుత్వమే భరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సమయానికి రాకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులు కేసీఆర్ అమ్ముకున్నారని, దీనిని గవర్నర్‌కు వివరించినట్లు కాంగ్రెస్ నేత వీహెచ్ తెలిపారు. కార్మికులది న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారని విప్లవ గాయకురాలు విమలక్క అన్నారు.
ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి: కోదండరాం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు బహిరంగ సభ నిర్వహించాయి. అన్ని పార్టీల నాయకులు హాజరై కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.