రైతులు ఇబ్బంది పడకుండా ఎరువులు సరఫరా చేయాలని.. రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులను.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం మేరకు ఎరువులు అందించాలని సూచించారు.
అడిగినంతా ఇచ్చాం..
హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించిన కిషన్ రెడ్డి.. పంటల విస్తీర్ణం, ఎరువుల అందుబాటుపై ఆరా తీశారు. రాష్ట్రంలో యూరియా పంపిణీ సక్రమంగా జరగాలని సూచించారు. అవసరమైతే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోరిన విధంగా ఈ ఏడాది 10.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని కిషన్రెడ్డి తెలిపారు.
గతేడాది ఈ సమయానికి 3.50 లక్షల టన్నుల యూరియాను విక్రయిస్తే.. ఈ సంవత్సరం ఇప్పటికే ఏడు లక్షల టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రానికి అదనంగా ఎరువులు అవసరమయ్యేలా ఉన్నాయని అధికారులు తెలిపారు. అవసరమైన మేరకు సహాయం అందిస్తామని కిషన్రెడ్డి అన్నారు.
సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ అధికారులతో పాటు కేంద్ర హాంశాఖ అదనపు కార్యదర్శి శశికిరణాచారి పాల్గొన్నారు.
ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు