ETV Bharat / city

'గుళ్లోకి వెళ్తే చాలనుకున్నా.. ఏకంగా గర్భగుళ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు..' - goreti venkanna book vallanki thalam

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం... తాను రాసిన పుస్తకం 'వల్లంకి తాళం' దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. గతంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నా.. సాహిత్య అకాడమీ పురస్కారం కోసం ఎదురుచూసేవాడినని తెలిపారు. ఆ ఆశను 'వల్లంకి తాళం' పుస్తకం నెరవేర్చడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్న గోరటి వెంకన్న... ఈ ఉత్సాహంతో తాను రచించిన మరో 10 పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి మూడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు రావడం ఈ ప్రాంత కవులు, రచయితలకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానంటోన్న గోరటి వెంకన్నతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

kendra sahitya akademi award winner goreti venkanna interview

author img

By

Published : Dec 30, 2021, 8:53 PM IST

'కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం ఎంతో ఆనందంగా ఉంది. దర్గాలోకో, చిన్న గుడిలోకో వెళ్లాలనుకున్న నన్ను నేరుగా తిరుమల గర్భగుళ్లోకే తీసుకెళ్లారు. చాలా సంతోషం. యురేనియం తవ్వకాలను అడ్డుకున్నప్పుడు అడవి గురించి చాలా రాశాను. వెన్నెల గురించి రాశాను. ఇలా నాకు తోచినవాటి మీద రాసుకుంటూ వెళ్తున్నాను. సాహితీలోకం నన్ను ఆదరించింది. అంతిమంగా కేంద్ర సాహిత్య అకాడమీ ఆదరించి.. నా మీద వాత్సల్యంతో ఈ పురస్కారాన్ని అందించారనుకుంటున్నా. ఇచ్చినందుకు కమిటీ సభ్యులందరికీ రుణపడి ఉంటా. ఈ గౌరవం నాకు దక్కింది కాదు.. నేను రాసిన పుస్తకానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. గతంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నా... సాహిత్య అకాడమీ పురస్కారం కోసం ఎదురుచూసేవాడిని. ఆ ఆశను 'వల్లంకి తాళం' పుస్తకం నెరవేర్చింది. ఈ ఉత్సాహంతో నేను రచించిన మరో 10 పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తా. తెలంగాణ ప్రాంతానికి మూడు... కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు రావడం ఈ ప్రాంత కవులు, రచయితలకు దక్కిన గొప్ప గౌరవం.'

- గోరటి వెంకన్న, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత

గుళ్లోకి వెళ్తే చాలనుకున్నా.. ఏకంగా గర్భగుళ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.