ETV Bharat / city

KCR letter to Modi: బొగ్గు వేలం ఆపేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ - singareni coal blocks auction

kcr letter to modi for stop auction in 4 singareni coal blocks

author img

By

Published : Dec 8, 2021, 7:44 PM IST

Updated : Dec 8, 2021, 8:25 PM IST

19:41 December 08

KCR letter to Modi: వేలం ఆపేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

KCR letter to Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ మరోసారి లేఖ రాశారు. ఈసారి.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ప్రధాని మోదీని కోరుతూ కేసీఆర్​ లేఖ రాశారు. కోల్​బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మికసంఘాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.

coal block auction: ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోందని సీఎం లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా... 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని సీఎం కేసీఆర్ తెలిపారు.

coal block auction in telangana: సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులు మంజూరు చేసిందన్న ముఖ్యమంత్రి... అందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేసేందుకు ప్రతిపాదించిన జేబీఆర్ఓసి-3, శ్రావన్ పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే -6 యూజీ బ్లాక్​ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

coal block allocation: ఈ నేపథ్యంలో నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని కేసీఆర్​ కోరారు. ఈ బ్లాక్​లను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 8, 2021, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.