కరీంనగర్‌లోని సీతారాంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఫినోలెక్స్ సంస్థ పేద ప్రజలకు దీపావళి సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు పాల్గొన్నారు. ఫినోలెక్స్ సంస్థ అందిస్తున్న రూ.1400 విలువ చేసే నిత్యవసర సరుకులను 200 మందికి పంపిణీ చేసారు.
కొవిడ్ సమయంలో ప్రజలకు సేవలందించిన మేయర్ సునీల్ రావుతో పాటు పలువురు కార్పొరేటర్లను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. కొవిడ్ వేళ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫినోలెక్స్ సంస్థ వారు 30 వేల మంది పేదలకు నిత్యవసర సరుకులు అందించడం అభినందనీయమని మేయర్ కొనియాడారు. సేవా భావంతో ముందుకొచ్చిన ఫినోలెక్స్ సంస్థ యజమాన్యానికి... వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.