ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి.. జస్టిస్ లలిత కుమారి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. జస్టిస్ లలిత కుమారిని బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం లభించగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చూడండి: Errabelli Dayakar Rao: భాజపా స్టేట్చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి సీరియస్