గాడియం స్పోర్టోపియాలో కల్పిస్తున్న ఉన్నత ప్రమాణాలు, నాణ్యత కలిగిన క్రీడా సదుపాయాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లొచ్చని... తెలంగాణ ఒలంపిక్ బాడీ అధ్యక్షులు జయేష్ రంజన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పురపాలక సంఘం పరిధి కొల్లూరు ధైర్యం అంతర్జాతీయ పాఠశాలలో గాడియం స్పోర్టోపియా అథ్లెటిక్స్ తొలి వార్షిక క్రీడా పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అత్యుత్తమ ప్రమాణాలు, 30 మంది శిక్షకులు, ఆధునిక సౌకర్యాలతో క్రీడా పాఠశాల నెలకొల్పడం సంతోషకరమని జయేష్ రంజన్ అన్నారు. ఈ పాఠశాల ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇలాంటి సౌకర్యాలతో పాఠశాల నెలకొల్పడం దేశంలోనే మొదటిసారి అని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ అన్నారు. ప్రపంచస్థాయి సౌకర్యాలతో అన్ని క్రీడలకు సదుపాయాలు కలిగి ఉండటం మంచి విషయమన్నారు.
ఇదీ చూడండి: చైనాకు చెక్ పెట్టేందుకు ఆర్మీకి 'టిబెట్' పాఠాలు