కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందన్న ఆయన... అన్ని వర్గాల్లోనూ పీసీసీ అధ్యక్షులయ్యే సామర్థ్యం కలిగిన నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన ధనిక, పేద అన్న తేడా కాంగ్రెస్ పార్టీలో ఉండదని అన్నారు. సామాన్య కార్యకర్తలు కూడా పీసీసీకి అర్హులేన్నారు.
బీసీలల్లో పీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి కావాలని కోరుకుంటున్న హనుమంతరావు కూడా అర్హుడేనన్నారు. ఎస్సీ వర్గంలో అటు మాల, ఇటు మాదిగ రెండు వర్గాలు ఉన్నప్పటికీ... మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ సామాజిక వర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు పోటీ పడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చే సామర్థ్యం కలిగిన నేతలకే పీసీసీ పీఠం కట్టబెడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు