Jagananna vidyadeevena: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల్లో జగనన్న విద్యాదీవెన పథకం ఒకటి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద నగదు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అందజేస్తోన్న నగదును నేరుగా తల్లుల ఖాతాలో జమ చేస్తోంది. ఇప్పటి వరకు మూడు విడతల సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసింది. నేడు నాలుగో విడత నగదు జమ చేయాల్సి ఉంది.
ఈ క్రమంలోనే నాలుగో విడత 'జగనన్న విద్యాదీవెన'ను వాయిదా వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని మరో తేదీకి మార్చింది. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉండటంతో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ మేరకు మరో తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Jagananna vidya deevena: 'విద్యార్థులకు ఇవ్వగలిగిన ఆస్తి చదువే..'