నోరూరించే ఇరానీ రుచులు(Iranian food festival in Hyderabad) భాగ్యనగరానికి విచ్చేశాయి. హైదరాబాద్ మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్(International Food Festival 2021) ప్రారంభమైంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఐఆర్ సహకారంతో సీడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జరగనున్న ఫుడ్ ఫెస్ట్‌లో ఇరాన్ కాన్సులేట్ జనరల్ మినా హడియన్, ట్రైడెంట్ కనక్ మేనేజర్ దిబ్యా రంజన్భో పాల్గొన్నారు.
ఇరాన్ - హైదరాబాద్, ట్రైడెంట్ హోటల్ భాగస్వామ్యం వహిస్తున్న ఈ ఫెస్టివల్(Iranian food festival in Hyderabad)లో సంప్రదాయ ఇరానీ వంటకాలు, బిర్యానీ, మాంసాహారం విశేషంగా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఐదు రోజుల్లో ఇరానియన్ ఆహారం, సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింపజేసే చక్కటి వంటకాల ద్వారా తమ ఆహారపు అలవాట్లు, అభిరుచులు భారతీయులకు తెలియజేయాలన్నది లక్ష్యమని ఇరాన్ కాన్సులేట్ జనరల్ తెలిపారు.
ఇరాన్‌కు చెందిన సెలిబ్రిటీ చెఫ్ మోనా అథెంటిక్ ఇరానియన్ ఫుడ్(Iranian Food)ను అందిస్తోంది. ఇరానియన్ చెఫ్ మోనా పూర్దర్యాయి, ట్రైడెంట్ హోటల్ చెఫ్ ధర్మేందర్ లాంబా తయారు చేసిన నోరూరించే వంటకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇది ఇరానీ ఫుడ్ ఫెస్టివలే కాకుండా సంస్కృతి, సంప్రదాయాల పండుగ కూడా అని డ్రైటెండ్ హోటల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. భారత్ - ఇరాన్ దేశాల మధ్య ఆహారపు రుచులు తెలుసుకోవడంతోపాటు ఈ ఫెస్టివల్ సందర్శించి ఇరానీ రుచులు ఆస్వాదించాలని కోరారు.
ఇరాన్ సంస్కృతికి హైదరాబాద్‌లో ఏంతో ఆదరణ ఉంది. చరిత్ర, సంస్కృతి పరంగా హైదరాబాద్, ఇరాన్ మధ్య ఎన్నో సారుప్యతలున్నాయి. అందువల్లే హైదరాబాదీలు ఆస్వాదించేలా ఇక్కడ ఇరానియన్ ఆహారోత్సవం ఏర్పాటు చేశాం.
- మినా హడియన్, హైదరాబాద్‌లో ఇరాన్ కాన్సులేట్ జనరల్
- ఇదీ చదవండి : ఆ 256 మంది చిరు వ్యాపారులు.. 'పేద' కోటీశ్వరులు!