ETV Bharat / city

సంక్రాంతి తర్వాత ఇంటర్‌ తరగతులు ప్రారంభం

తొమ్మిది నెలలుగా మూతపడిన కళాశాలలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

intermediate-colleges-may-open-after-pongal-in-telangana
సంక్రాంతి తర్వాత ఇంటర్‌ తరగతులు ప్రారంభం
author img

By

Published : Jan 3, 2021, 7:22 AM IST

సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(టీపీజేఎంఏ) డైరీని మంత్రి శనివారం ఆవిష్కరించారు. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగాలని అందరం ఆశిద్దామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బడులు ప్రారంభించండి: టీపీఏ

సంక్రాంతి పండగ అనంతరం పాఠశాలలు, కళాశాలలను తిరిగి ప్రారంభించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం(టీపీఏ) తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు శనివారం టీపీఏ ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి విన్నవించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.