Inter Supply results 2022 : తెలంగాణ ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున కేవలం ద్వితీయ ఇంటర్ ఫలితాలు మాత్రమే విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Inter Second Year Supply results 2022 ఇంటర్ రెండో సంవత్సరం సప్లిమెంటరీలో 48,816 మంది ఉత్తీర్ణత సాధించారు. 47.74 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 5 నుంచి 8వరకు రీకౌంటింగ్‌కు అవకాశం బోర్డు కల్పించింది. ఇవాళ సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
మరోవైపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఇంటర్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారి కోసం గడువు పొడిగించారు. ఇవాళ్టితో ముగియనున్న ధ్రువపత్రాల పరిశీలన స్లాట్ బుకింగ్ గడువును సెప్టెంబర్ 2 వరకు పొడిగించారు. వెబ్ ఆప్షన్ల గడువు సెప్టెంబరు 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.