ETV Bharat / city

చాహర్‌ అసమాన పోరాటం... భారత్‌కు మరో విజయం

శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని... దీపక్‌ చాహర్‌ మాయతో 49.1 ఓవర్లలోనే చేధించింది. దీంతో ఇంకో మ్యాచ్‌ ఉండగానే భారత్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది.

భారత్‌కు మరో విజయం
భారత్‌కు మరో విజయం
author img

By

Published : Jul 21, 2021, 8:00 AM IST

ఓ అనుకోని హీరో.. టీమ్‌ఇండియాకు అనుకోని విజయాన్నందించాడు. పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (69 నాటౌట్‌; 82 బంతుల్లో 7×4, 1×6) అద్భుతంగా పోరాడడంతో మంగళవారం రెండో వన్డేలో భారత్‌ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. భువనేశ్వర్‌ (19 నాటౌట్‌; 28 బంతుల్లో 2×4)తో అభేద్యమైన ఎనిమిదో వికెట్‌కు చాహర్‌ 84 పరుగులు జోడించడంతో 276 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో భారత్‌ 116కే అయిదు వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్‌ (53; 44 బంతుల్లో 6×4), కృనాల్‌ పాండ్య (35) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. అయినా ఓటమి దిశగా సాగిన భారత్‌ను.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చాహర్‌ విజయపథంలో నడిపించాడు. చరిత్‌ అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50), కరుణరత్నె (44 నాటౌట్‌) రాణించడంతో మొదట శ్రీలంక 9 వికెట్లకు 275 పరుగులు సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం సంపాదించింది.

తడబాటు..:

ఛేదన ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి వన్డే హీరోలు పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1) త్వరగానే నిష్క్రమించారు. హసరంగ.. పృథ్వీని ఔట్‌ చేయగా.. కిషన్‌ను రజిత బౌల్డ్‌ చేశాడు. 5 ఓవర్లకు స్కోరు 39/2. కెప్టెన్‌ ధావన్‌ (29; 38 బంతుల్లో 6×4)... పాండే (37)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 12వ ఓవర్లో హసరంగ బౌలింగ్‌తో అతడు నిష్క్రమించేటప్పటికి స్కోరు 65 పరుగులే. ఈ దశలో ధాటిగా ఆడిన సూర్యకుమార్‌.. పాండేతో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించడంతో భారత్‌ 17 ఓవర్లలో 114/3తో లక్ష్యం దిశగా సాగింది. కానీ తర్వాతి ఓవర్లో భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. పాండే దురదృష్టవశాత్తు రనౌట్‌ కాగా.. హార్దిక్‌ (0)ను శనక వెనక్కి పంపాడు. 116కే అయిదు వికెట్లు కోల్పోయిన భారత్‌ను సూర్యకుమార్‌, కృనాల్‌ ఆదుకున్నారు. అయితే ఆరో వికెట్‌కు 44 పరుగులు జోడించాక సూర్యకుమార్‌ ఔట్‌ కావడంతో భారత్‌ ఓటమి దిశగా సాగింది.

సూపర్‌ చాహర్‌..:

160కే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో భారత్‌ ఓడిపోతుందనే అనిపించింది. కానీ చాహర్‌తో కలిసి కృనాల్‌ పోరాడాడు. ఆశలు పెరుగుతున్న సమయంలో జట్టు స్కోరు 193 వద్ద 36వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి సాధించాల్సిన రన్‌రేట్‌ అందుబాటులోనే ఉంది. పరుగులు చేయడానికి బ్యాట్స్‌మెనే లేరు. మిగిలిందల్లా ముగ్గురు టెయిలెండర్లే. చివరి 14 ఓవర్లలో 81 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ ఓటమి ఖాయమనిపించింది. ఈ దశలో భువనేశ్వర్‌తో కలిసి దీపక్‌ అసమాన పోరాటపటిమను ప్రదర్శించాడు. ఒత్తిడి తేవడానికి ప్రయత్నించిన లంక స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. అతను చక్కటి షాట్లతో బౌండరీలు సాధించడంతో జట్టు క్రమంగా లక్ష్యానికి చేరువైంది. భువనేశ్వర్‌ కూడా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ చాహర్‌కు సహకరించాడు. క్రమంగా లంకపై ఒత్తిడి పెరిగింది. చాహర్‌ 64 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. చివరి 4 ఓవర్లలో భారత్‌కు 29 పరుగులు అవసరం కాగా.. చమీర బౌలింగ్‌లో భువి, చాహర్‌ చెరో ఫోర్‌ కొట్టారు. చివరి 2 ఓవర్లలో విజయానికి కావాల్సింది 15 పరుగులు. చమీర వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్లో చాహర్‌, భువి చెరో ఫోర్‌ కొట్టేశారు. ఆఖరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా.. తొలి బంతినే బౌండరీకి తరలించి భారత్‌ను గెలిపించాడు చాహర్‌.

ఇదీ చదవండి: రాహుల్‌ శతకం.. రాణించిన జడేజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.