ETV Bharat / city

భారత్​ను వణికిస్తున్న అధిక రక్తపోటు - india heart study report

జీవనశైలి వ్యాధులైన రక్తపోటు, మధుమేహం భారత్​ను వణికిస్తున్నాయి. వృత్తి, వ్యాపకాల్లో ఉరుకుల పరుగుల జీవితాలు, ఒత్తిళ్లు, ఆహారపు అభిరుచులు-అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.  అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం, థైరాయిడ్​, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల విఫలం, దృష్టిలోపం, మరణాలకు సైతం దారితీస్తున్నాయి. 'ఇండియా హార్ట్​ స్టడీ'  దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనంలో దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెలుగు చూశాయి.

భారత్​ను వణికిస్తున్న అధిక రక్తపోటు
author img

By

Published : Aug 22, 2019, 9:21 PM IST

భారత్​ను వణికిస్తున్న అధిక రక్తపోటు

రక్తపోటు, మధుమేహానికి రాజధానిగా పేరుగాంచిన భారత్‌లో మరిన్ని జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయి. తెలంగాణలో 36 శాతం మందికి వైట్-కోట్ హైపర్‌టెన్షన్ ఉన్నట్లు తాజాగా 'ఇండియా హార్ట్ స్టడీ - ఐహెచ్‌ఎస్' అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు... సైలెంట్ కిల్లర్‌ అని... ఆ ప్రభావం మూత్రపిండాలు, గుండె, మెదడుపై ప్రభావం చూపే ప్రమాదమున్నందున దాని బారినడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు.

తెలంగాణలో 6 శాతం

దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో "ఇండియా హార్ట్ స్టడీ" శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసింది. దీనికి సంబంధించిన నివేదికను హైదరాబాద్​లో విడుదల చేశారు. 1,233 మంది వైద్య నిపుణులు 23,253 మందిని పరీక్షించారు. వీరిలో 42 శాతం మందిలో వైట్ - కోట్, మాస్ట్​ హైపర్‌టెన్షన్​లు ఉన్నట్లు తేలింది. అత్యధికంగా 12 శాతం తమిళనాడులో ఉండగా... అత్యల్పంగా కేరళ, జమ్మూకశ్మీర్‌లో 1 శాతం మాత్రమే ఉంది. తెలంగాణలో 6 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 4 శాతం మంది ఉన్నట్లు వెల్లడైంది.

సాధారణ రక్తపోటు 135/85

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం... భారత్‌లో సాధారణ రక్తపోటు 135/85 ఉండవచ్చు. పురుషులు, స్త్రీలల్లో 180 ఉంటే మాత్రం హైపర్‌టెన్షన్​ ఉన్నట్లేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. వైట్​-కోట్​, మాస్ట్​ హైపర్‌టెన్షన్​ల​ను గుర్తించకపోవడం వల్ల గుండె, మూత్రపిండాలు, మెదడుకు సమస్యలు సృష్టించడంతోపాటు అకాల మరణాలకు దారితీస్తున్నాయని తెలిపారు.

ఏటా 10 వేల మంది

అధిక రక్తపోటు వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, యూరప్, కెనడా లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో ఈ తీవ్రత అధికంగా ఉంది. ఏటా దేశంలో హృద్రోగ సమస్యలతో 10 వేల మంది చనిపోతున్నారు. ఒక్క తెలంగాణలో ప్రతినెలా 10 వేల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది.

ఇదీ పరిస్థితి

రక్తపోటు కేటగిరీలు పరిశీలిస్తే... ఆఫీస్​లో ఉన్నప్పుడు 140/90, ఇంట్లో ఉన్నప్పుడు 135/85 బీపీ నమోదైతే... హైపర్‌టెన్షన్. క్లినిక్​లో ఎక్కువగా ఉండి, ఇంట్లో పరీక్షించుకున్నప్పుడు తక్కువగా ఉంటే వైట్‌-కోట్ హైపర్‌టెన్షన్‌ అని, ఇంట్లో ఉండగా ఎక్కువగా ఉండి క్లినిక్​లో తక్కువగా ఉంటే దాన్ని మస్ట్​ హైపర్‌టెన్షన్​గా గుర్తిస్తారు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం కాబట్టి అప్పుడు బీపీ తక్కువ ఉంటుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని తాజా అధ్యయనం ద్వారా వైద్యులు నిర్ధారించారు.

అదే పరిష్కారం

భారత్​ను వణికిస్తున్న వైట్‌-కోట్ హైపర్‌టెన్షన్​, మాస్ట్​ హైపర్‌టెన్షన్​ లాంటి సమస్యలకు ఒక్కటే పరిష్కారం... అదే సరైన రోగ నిర్ధారణ. ఈ అంశంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చే లక్ష్యంతో ఇండియా హార్ట్ స్టడీ నివేదికను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించనున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. చక్కని జీవనశైలి, వ్యాయామం, మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.