ETV Bharat / city

రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా రాబడి... రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం

రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తోంది. దాదాపు ఐదు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలచినప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఆదాయం వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 6 వేల 950 కోట్లకు పైగా మొత్తం వ్యవసాయేతర భూములు, భవనాల రిజిస్ట్రేషన్ల ఆదాయం రాగా.. మరో రెండున్నర వేల కోట్లు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

income increased in registrations department

author img

By

Published : Feb 20, 2021, 4:45 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టె శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. కొవిడ్ ప్రభావం, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళన కోసం దాదాపు ఐదు నెలలపాటు రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోయింది. డిసెంబర్ నుంచి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. చాలా కాలంగా ఆగిన వారంతా రిజిస్ట్రేషన్లకు జనం క్యూ కట్టారు. పాత విధానంలో రిజిస్ట్రేషన్లు మొదలైన తర్వాత గతంలో రోజుకు 30 నుంచి 40 కోట్లు రాబడి వస్తుండేది... తాజాగా రోజుకు సగటున 50 కోట్లు రాబడి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక శుభదినాలల్లో అయితే రాబడి రెట్టింపు... అంతకంటే ఎక్కువ కూడా వస్తున్నట్లు వివరించారు. చాలా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో 6 వేల 646 కోట్లు లక్ష్యం కాగా..... 7 వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక ఏడాదిలో 10 వేల కోట్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రాబడి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

పాతవిధానం ద్వారానే...

రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసే దిశలో అడుగులు ముందుకేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రిజిస్ట్రేషన్లను వేరు చేసింది. రాష్ట్రంలో గత ఆర్ధిక ఏడాదిలో 17 లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు అయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో నాలుగున్నర నుంచి ఐదు లక్షలు రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూములకు చెందినవిగా అధికారులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రెవెన్యూ శాఖకు అప్పగించింది. వ్యవసాయేతర భూములు, భవనాలు రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్ ద్వారా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానం పై అభ్యంతరం తెలుపుతూ కొందరు న్యాయస్థానం తలుపు తట్టడంతో... ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అప్పటికే ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడానికి మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం ఆపింది. న్యాయస్థానం అనుమతిస్తేనే ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో మరింత ఆలస్యం అవుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం పాత విధానం ద్వారానే రిజిస్ట్రేషన్లను పునఃప్రారంభించింది.

రెండున్నర వేల కోట్లు అంచనా...

ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు ఏడు లక్షల 76 వేలకుపైగా రిజిస్ట్రేషన్ల ద్వారా 6 వేల 952 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ ఆర్ధిక ఏడాది మొత్తం రాబడిలో 3 వేల 234 కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రాగా..... మరో 3 వేల 717 కోట్ల రాబడి ఈ- స్టాంపుల విక్రయం ద్వారా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నెలకు 1500 నుంచి 1600 కోట్ల వరకూ రిజిస్ట్రేషన్ శాఖకు రాబడి వస్తుండడంతో..... మార్చి చివరి వరకు దాదాపు రెండున్నర వేల కోట్లు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదు నెలల పాటు రిజిస్ట్రేషన్లు పూర్తిగా స్తంభించినప్పటికీ ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ రాబడి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: 800కిలోమీటర్లు.. 900సీసీ కెమెరాలు.. చిక్కిన కిడ్నాపర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.