ETV Bharat / city

చిన్న వానకే వణుకు.. సామర్థ్యం మేర లేని కాలువలు.. అసంపూర్తి పనులతో ఇబ్బందులు

వర్షం వచ్చిందంటే చాలు పట్టణాల్లోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాన, మురుగు నీరు కలుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన కాలువలు లేకపోవడం.. నిర్మాణ పనుల్లో జాప్యం ఈ దుస్థితికి ప్రధాన కారణం.

http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/10-July-2022/15783984_223_15783984_1657408732149.png

author img

By

Published : Jul 10, 2022, 4:57 AM IST

చిన్నవానకే నగరాలు ముంపునకు గురవుతున్నాయి. చినుకు పడితే పట్టణాలు వణికిపోతున్నాయి. వాన నీరు, మురుగు నీరు కలిసి వీధుల్ని ముంచెత్తుతుండడం.. ఇళ్లలోకి చేరుతుండడంతో ఆయా కాలనీల ప్రజల అవస్థలు అన్నీఇన్నీ కావు. కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నా.. ప్రణాళికలేమి, అర్ధంతరంగా పనులు ఆగిపోతుండడం, నిధులున్నా చేయకపోవడం.. ప్రజలపాలిట శాపాలుగా మారుతున్నాయి. పల్లెల నుంచి వలసలతో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదేస్థాయిలో మురుగునీటి కాలువల సామర్థ్యాన్ని పెంచడంలేదు. అనేకచోట్ల మురుగునీటి కాలువలు, వాననీటి కాలువలు ఒకటే కావడమూ సమస్యకు దారితీస్తోంది. పట్టణాలు, నగరాల శివార్లలోని పలు కాలనీల్లో మురుగు నీరు చెరువులుగా ఏర్పడుతుండడంతో నెలల తరబడి దుర్గంధం నెలకొంటోంది. దోమలకు ఆవాసంగా మారి అనారోగ్య పరిస్థితులకు కారణమవుతున్నాయి.

.
.

ప్రమాదకరంగా వరంగల్‌ నాలాలు
తరచూ భారీ వర్షాలు, వరదల తాకిడికి గురయ్యే వరంగల్‌లో నాలాలను విస్తరించినా.. వాటి నిర్వహణను పూర్తిగా విస్మరించారు. నగరంలో 45 కిలోమీటర్ల పొడవైన నాలాలు ఉండగా కేవలం 12 కిలోమీటర్ల మేర మాత్రమే రక్షణ గోడలు నిర్మించారు. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఓపెన్‌ నాలాలు ప్రమాదకరంగా మారాయి.

జనగామలో రూ.2 కోట్లు మట్టిపాలు
జనగామ పట్టణం గత ఏడాది భారీ వర్షాలకు జలమయం అయింది. జనజీవనానికి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏడాది గడచినా అదే పరిస్థితి కొనసాగుతోంది. మురుగునీటి వ్యవస్థ గాడిన పడలేదు. వాననీరు వెళ్లేందుకు ప్రత్యేక కాలువలు లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. రూ.9.5 కోట్లతో మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు అంశం ప్రతిపాదనలు, ప్రణాళికలకే పరిమితమైంది. మురుగునీటిని పట్టణం వెలుపలికి తరలించేందుకు రూ.4 కోట్లతో చేపట్టిన పనులు సగం పూర్తయ్యాక రద్దయ్యాయి. దీంతో రూ.2 కోట్లు మట్టిపాలయ్యాయి. వాగులోకి మురుగు నీటిని మళ్లించే అంశంపై అభ్యంతరాలు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది.

కరీంనగర్‌లో ఎక్కడి పనులు అక్కడే
కరీంనగర్‌లో చేపట్టిన వివిధ పనులు ఏడాదిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. నగరంలో 14 కిలోమీటర్ల మేర మురుగునీటి కాలువలు నిర్మించినా కల్వర్టుల నిర్మాణాన్ని విస్మరించడంతో ముంపు సమస్య పొంచి ఉంది. పాత కల్వర్టులకే పైపుల్ని అనుసంధానం చేయడంతో భారీ వర్షాలకు కాలువలు పొంగుతున్నాయి. రాంనగర్‌ ప్రధాన మురుగునీటి కాలువలోని మురుగంతా రోడ్లపైకే వస్తోంది.

నల్గొండలో ప్రధాన కాలువ పనులకు 'వాయిదాల జబ్బు'
నల్గొండ పట్టణంలో సుమారు 12 కాలనీలకు ముంపు ముప్పు పొంచిఉంది. మురుగునీటి కాలువలు ఉన్నా వాటిని అనుసంధానిస్తూ ప్రధాన కాలువను నిర్మించకపోవడంతో మురుగంతా కాలనీల్లోనే ఉండిపోతోంది. ఏటా వర్షాకాలంలో ఈ కాలనీలు నాలుగైదు రోజులు నీటిలోనే నానుతున్నాయి. రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టాల్సిన ప్రధాన కాలువ పనులు 2018 నుంచి ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి.

భువనగిరిలో ఏళ్లయినా అదే సమస్య
భువనగిరి పట్టణంలో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మురుగు, వరద నీటి కాలువలు నిర్మించకపోవడంతో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని ప్రధాన మురుగు కాలువ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో చెరువులోకి చేరాల్సిన నీరు ఆవాస ప్రాంతాల్లోకి పారుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులతో (బీఆర్‌జీఎఫ్‌) గతంలో చేపట్టిన పనులు పూర్తికాకపోగా, 2014-15లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. హౌసింగ్‌ బోర్డు కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువల వ్యవస్థ ద్వంసం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇతర పట్టణాల్లో..

  • రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎల్‌బీనగర్‌, రఘుపతిరావునగర్‌, తిరుమలనగర్‌, 5 ఇన్‌క్లైన్‌ సహా వివిధ కాలనీల ప్రజలు తీవ్ర మురుగునీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. కొద్దిపాటి వర్షాలకే వరదనీరు, మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది.
  • నిర్మల్‌ పట్టణంలో మురుగునీటి కాలువలు చెత్త చెదారంతో నిండిపోయి చెత్త దిబ్బల్ని తలపిస్తున్నాయి. ప్రియదర్శినగర్‌లోని ప్రధాన మురుగునీటి కాలువలో చెత్తను తొలగించకపోతుండడంతో కొద్దిపాటి వర్షాలకే మురుగు పొంగుతోంది.
  • ఆదిలాబాద్‌ పట్టణం 12వ వార్డులో వరదనీటి కాలువ నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.2 కోట్లు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు.
  • మిర్యాలగూడ పట్టణం ప్రకాశ్‌నగర్‌ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిసినా వీధులన్నీ చెరువులుగా మారుతున్నాయి.

ఇదీ చూడండి: ముస్లింలకు గవర్నర్​, సీఎం కేసీఆర్​.. బక్రీద్​​ శుభాకాంక్షలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.