ETV Bharat / city

Demolitions in GHMC : జీహెచ్​ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

author img

By

Published : Feb 4, 2022, 1:40 PM IST

Demolitions in GHMC: జీహెచ్​ఎంసీ పరిధిలో నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు, ఇతర అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్​లోని మూడు మున్సిపాలిటీల పరిధిలో పది అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

Demolitions in GHMC
Demolitions in GHMC

Demolitions in GHMC : గ్రేటర్ పరిధిలో హెచ్ఎండీఏ టాస్క్​ఫోర్స్‌ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలు కొనసాగిస్తున్నారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో పది అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో 6, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో 3, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున అక్రమ నిర్మాణాలను టాస్క్ ఫోర్స్ బృందాలు కూల్చివేశాయి.

Demolitions in Hyderabad : గతంలోను దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా.. వాటిలో ఒక నిర్మాణాన్ని తిరిగి నిర్మిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో మేడ్చల్ మల్కాజ్ గిరి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ), హెచ్ఎండీఎ డైరెక్టర్, దుండిగల్ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించి సదరు నిర్మాణ పిల్లర్లను దగ్గరుండి కూల్చివేయించారు.

ఇదీ చదవండి : Hyderabad Drugs Case Update : డ్రగ్స్ కేసులో టోనీ ఏజెంట్లు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.