ETV Bharat / city

పోలీసు సిబ్బందికి వాటర్​ బాటిల్స్​ పంచిన ​ సీపీ అంజనీ కుమార్

లాక్​డౌన్​ సమయంలో ప్రజల సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్​ సిబ్బందికి హైదరాబాద్​ నగర కమిషనర్​ అంజని కుమార్​ స్టీల్​ వాటర్​ బాటిల్స్​ పంచారు. లాక్​డౌన్​ సమయంలో పోలీసులు సవాళ్లను ఎదుర్కొని పనిచేస్తున్నారని ప్రశంసించారు.

author img

By

Published : Apr 30, 2020, 9:58 PM IST

Hyderabad Police Commissioner Distributes Water bottles For Police Staff
పోలీసు సిబ్బందికి వాటర్​ బాటిల్స్​ పంచిన ​ సీపీ అంజనీ కుమార్

లాక్​డౌన్ సమయంలో ప్రజల సంరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించడంలో పోలీసు సిబ్బంది సవాళ్లను ఎదుర్కొని పని చేస్తున్నారని ప్రశంసించారు. లాక్​డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న చిక్కడపల్లి, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్​లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీ అంజనీ కుమార్ స్టీల్ వాటర్ బాటిళ్లను అందజేశారు. లాక్​డౌన్ సమయాల్లో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.

ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదని, ప్రతి ఒక్కరు సామాజిక దూరం, లాక్​డౌన్, మాస్కులు ధరించడం మరిచిపోవద్దని సూచించారు. లాక్​డౌన్ సమయంలో పోలీస్ సిబ్బంది కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు.

ఇవీ చూడండి: 'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.