ETV Bharat / city

రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం - జీహెచ్‌ఎంసీ

నగరంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి.కేసులు ఎక్కువైనందున భాగ్యనగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రోజు రోజుకు కొవిడ్​-19 ప్రబలుతున్న తరుణంలో నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

hyderabad-people-fear-on-increased-covid-19-cases-in-city
రికార్డు స్థాయిలో కేసులు... ఉలిక్కిపడ్డ భాగ్యనగరం
author img

By

Published : Apr 4, 2020, 8:29 AM IST

Updated : Apr 4, 2020, 11:11 AM IST

కరోనా కాటుతో ఒక్కసారిగా భాగ్యనగరం ఉలిక్కి పడింది. శుక్రవారం ప్రధాన నగరంలో రికార్డు స్థాయిలో 26 కేసులు వరకు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రాని రంగారెడ్డి గ్రామీణంలో ఒకరు, మేడ్చల్‌ జిల్లాలో నలుగురికి కొవిడ్‌-19పాజిటివ్‌గా తేలింది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 74 వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందగా నగరంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆయా ప్రాంతాల్లో వైద్య, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి...యాంటీ వైరల్‌ రసాయనాలను పిచికారి చేస్తున్నారు.

కొత్తగా ఐదు కరోనా కేసులు

కుత్బుల్లాపూర్‌లో శుక్రవారం ఒక్క రోజే మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలో బాధితుల సంఖ్య పదికి చేరింది. ఇందులో ఒకరు మృత్యువాత పడగా మిగతా తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు. దిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 15 మందిని గుర్తించి వారిని పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి రక్తనమూనాలను తీసుకుంటున్నారు. బాధితుల ఇళ్లకు మూడు కి.మీ. పరిధిలో ఇంటింటికి సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు.

  • సైఫాబాద్‌ ఠాణా పరిధిలో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరూ దిల్లీలో సభకు వెళ్లి వచ్చిన వారేనని తేలింది. లక్డీకాపూల్‌, చింతల్‌బస్తీలో ఉంటున్న వీరి కుటుంబ సభ్యులనూ పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు(44) శుక్రవారం కరోనాతో మృతి చెందాడని అధికారులు తెలిపారు.

నందిగామ మండలంలో...

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చెందిన ఓ మహిళ కరోనా వ్యాధి లక్షణాలతో మరణించారని శుక్రవారం వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఆమె గత 31న అనారోగ్యానికి గురికావడంతో వివిధ ఆస్పత్రులు తిరిగి ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. మహిళ మృతికి కారణం కరోనా అని తేలడంతో గ్రామానికి జిల్లా కలెక్టరు అమోయ్‌కుమార్‌, సీపీ సజ్జనార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, వైద్య అధికారులు చేరుకున్నారు.

ఛాతి ఆస్పత్రిలో 42 మంది

కొవిడ్‌-19 నిర్ధరణ అయినందున ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో 17 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 25 మంది అనుమానితులు ఆసుపత్రిలో క్వారంటైన్‌లో ఉన్నారు. వీరి పరీక్షల నివేదిక రావాల్సి ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మహబూబ్‌ఖాన్‌ తెలిపారు.

ఇదీ చూడండి: 'మూడురోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు'

Last Updated : Apr 4, 2020, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.