హైదరాబాద్‌లో నగర మేయర్ బొంతు రామ్మోహన్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనుల పరిశీలనతో పాటు నిరాశ్రయులకు నిత్యవసరాలు పంపిణీ చేశారు. దిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి విద్యాసంస్థలు ద్వారా చర్లపల్లి డివిజన్ ఇందిరమ్మ గృహకల్ప, చర్చి కాలనీల్లో నివసిస్తున్న 1100 కుటుంబాలకు సరకుల పంపిణీ చేశారు. ఆకలితో ఏ ఒక్కరూ కడుపు మాడ్చుకోవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు మేయర్ పేర్కొన్నారు.
అన్నపూర్ణ కార్యక్రమంలో రోజుకు 60వేల మందికి, దాతల సహకారంతో 40 వేల మందికి ఆయా ప్రాంతాల్లో భోజనాలు ఉచితంగా పెడుతున్నట్టు మేయర్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్‌లో ఆశ్రయం పొందిన 400 మందికి బ్లాంకెట్లు పంపిణీ చేశారు. సామాజిక దూరాన్ని పాటించేందుకు 130 మందిని విక్టోరి ప్లే గ్రౌండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఎస్సార్డీపీ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఓవైసీ హాస్పిటల్, ఐఎస్ సదన్, బహదూర్‌పుర క్రాస్‌రోడ్‌లో నిర్మిస్తున్న పై వంతెన పనులను మేయర్ తనిఖీ చేశారు.
ఇదీ చూడండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!