ETV Bharat / city

సదర్​ ఉత్సవాలకు ముస్తాబు.. బరిలో దున్నరాజు 'లవ్​రానా' - హైదరాబాద్​ వార్తలు

సదర్​ ఉత్సవాల నిర్వహణకు హైదరాబాద్​ నగరం ముస్తాబవుతోంది. తమ దున్నరాజు లవ్​రానా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ఖైరతాబాద్​కు చెందిన మధుయాదవ్​ తెలిపారు. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని తెలిపారు.

SADAR FEST
సదర్​ ఉత్సవాలకు ముస్తాబు.. బరిలో దున్నరాజు 'లవ్​రానా'
author img

By

Published : Nov 12, 2020, 12:01 PM IST

Updated : Nov 12, 2020, 2:38 PM IST

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈనెల 15న జరిగే ఉత్సవాల్లో భాగ్యనగరానికి చెందిన దున్నరాజు లవ్​రానా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.

యాదవులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సదర్​ ఉత్సవాల్లో మేలుజాతి దున్నరాజులు ఆకర్షణగా నిలువనున్నాయి. దున్నరాజు లవ్​రానాను ఏడాది కిందట హరియాణా నుంచి తీసుకొచ్చినట్లు ఖైరతాబాద్​కు చెందిన మధుయాదవ్​ తెలిపారు. ఈ దున్నరాజుకు ఉదయం 10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్లపాలు, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్ ఆహారంగా పెడుతున్నట్లు తెలిపారు. జానీ వాకర్ మద్యం తాగుతుందని చెప్పారు. రోజుకు రూ.10 వేల వ్యయమవుతుందని వివరించారు.

కేవలం సదర్​ ఉత్సవాల కోసమే కాకుండా, పాడి పరిశ్రమ అభివృద్ధి, మేలైన జాతి దున్నల కోసం దున్నరాజు లవ్​రానాను పెంచుతున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందన్నారు.

మా దున్నరాజు పేరు లవ్​రానా. సదర్​ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్​, నారాయణగూడలో జరిగే సదర్​ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బరువు 1750 కిలోలు, ఆరడుగుల ఎత్తు, 12 అడుగల పొడవు దీని సొంతం. యాదవ సోదరులు సదర్​ ఉత్సవాల కోసం పంజాబ్​, హరియాణా నుంచి దున్నరాజులను తీసుకొస్తారు. తాము మాత్రం సదర్​తోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం, మేలైన దున్నల ఉత్పత్తి కోసం దీనిని పెంచుతున్నాం. దీని విలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుంది.

- మధు యాదవ్​, దున్నరాజు లవ్​రానా యజమాని

ఇవీచూడండి: నాజిర్​ బేగ్​.. ఓ నయా ఆదిమానవ్​

Last Updated : Nov 12, 2020, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.