ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నందున నగరంలోని పరిస్థితులు, వివిధ అంశాలపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్... దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. నగరంలోని సీసీ టీవీల పనితీరు, రౌడీషీటర్ల కదలికలు, పీడీ యాక్టుల నమోదు, జీరో ఎఫ్ఐఆర్ వంటి అంశాలపై చర్చించారు.
శబ్ధ కాలుష్యంపై కూడా ట్రాఫిక్ అధికారులతో సీపీ సమీక్షించారు. దృశ్య మాధ్యమ సమీక్ష సమావేశంలో సీపీతోపాటు, సీసీఎస్, ట్రాఫిక్, టాస్క్‌పోర్స్, ఇంటెలిజెన్స్, శాంతిభద్రత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం