హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా డివిజన్ పోలీస్‌ల ఆధ్వర్యంలో... రెడ్‌క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై... ప్రారంభించారు. తలసేమియా వ్యాధి గ్రస్థుల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 80మందికి రక్తదానం చేసినట్టు వెల్లడించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్థానికులు... 150 మంది రక్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రక్త దానమే కాకుండా ప్లాస్మా దానంలోనూ పోలీస్ విభాగం ముందున్నట్టు సీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మండలం డీసీపీ, అదనపు డీసీపీ, ఫలక్‌నుమా ఏసీపీ తదితరులు పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్ సహకారంతో ఫలక్‌నుమా పోలీసుల రక్తదాన శిబిరం - రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. తలసేమియా వ్యాదిగ్రస్థుల కోసం రెడ్‌క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.