కరోనాతో సీబీఐ సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.ప్రవీణ్ రాజు కన్ను మూశారు. శ్వాస సంబంధిత సమస్యతో ఈనెల 9న నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేరిన ప్రవీణ్ రాజుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.
హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్, ఓఎంసీ, ఎమ్మార్ తదితర కేసుల విచారణలో ప్రవీణ్ రాజు కీలక పాత్ర పోషించారు. సుమారు 25 ఏళ్లుగా సీబీఐ న్యాయ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
ఇదీ చదవండి: శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిపమాదం