హైదరాబాద్ నగరంలో రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ జలాశయంలోకి భారీగా నీరు వస్తోంది. జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 513.410 మీటర్ల చేరుకుంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు జలాశయంలో 514.17 మీటర్లకు నీరు చేరింది.
సాగర్‌లోకి 3,987 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా... తూముల ద్వారా 5,568 క్యూసెక్కుల జౌట్ ఫ్లో నీరు బయటకు వెళుతోంది. సాగర్ పరివాహక ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసి... స్థానిక కమ్యూనిటీ హళ్లకు తరలించారు.
ఇవీచూడండి: ఉద్ధృతంగా మూసీ.. ఉప్పొంగుతున్న హిమాయత్‌సాగర్