ETV Bharat / city

పింగళి తీసుకెళ్లిన జాతీయ పతాకాన్ని చూసి గాంధీ ఏమన్నారు..? - జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య న్యూస్

ఓ జాతి మొత్తానికి ప్రతినిధిగా నిలుస్తోన్న జాతీయ పతాకం రూపశిల్పి తెలుగు వాడేనని చెప్పుకోవడం ఎంతో గర్వకారణం. ఉన్నత విద్యావంతుడు, బహుభాషా కోవిదుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, రచయితగా బహుముఖ ప్రతిభ చాటిన పింగళి.. జాతీయ పతాక రూపకల్పనకు ఎంతగానో శ్రమించారు. ఎన్నో ఆలోచనలతో.. 30కి పైగా జాతీయ పతాకాల నమూనాలతో వెళితే... స్వయంగా సూచనలు అందించారు గాంధీ మహాత్ముడు. ఆపైనా.. మరెన్నో మలుపులు.. ఎన్నో ఆసక్తికర పరిణామాలు. అసలు జాతీయ పతాక రూపకల్పన వెనక కథేంటీ..? పింగళి వెంకయ్యగారి కృషి ఏంటి..? స్వతంత్ర భారతావనిలో పింగళికి దక్కాల్సిన గౌరవం దక్కిందా..?

pingali venkaiah
పింగళి తీసుకెళ్లిన జాతీయ పతాకాన్ని చూసి గాంధీ ఏమన్నారు..?
author img

By

Published : Mar 13, 2021, 6:08 PM IST

పింగళి తీసుకెళ్లిన జాతీయ పతాకాన్ని చూసి గాంధీ ఏమన్నారు..?

సువిశాల, వైవిధ్య, విశిష్ట భారతావనికి నిండైన చిహ్నం.. త్రివర్ణ పతాకం. స్వాతంత్య్ర పోరాటంలో ప్రజల మధ్య ఐక్యత సాధించేందుకు, దేశ ప్రజల్లో స్ఫూర్తిని, పోరాట పటిమను రగిలించేందుకు ఉద్యమ గీతాలు, నినాదాలు ప్రత్యేక పాత్ర పోషించాయి. అందులో జాతీయ పతాకాలు మొదటి వరుసలో నిలిచాయి.

పింగళికి బాధ్యత

1921 మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 1 తేదీల మధ్య బెజవాడలో జరిగిన అభిల భారత కాంగ్రెస్‌ సమావేశాల్లో ప్రస్తుత జెండాకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ సమావేశాలకు... మహాత్మా గాంధీ, కస్తూర్భా గాంధీ, సర్ధార్‌ వల్లబ్​ భాయ్‌ పటేల్, మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్‌, సి.రాజగోపాలాచారి, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి దిగ్గజ నేతలు హాజరయ్యారు. అక్కడే పింగళికి గాంధీజీ జాతీయజెండా రూపకల్పన బాధ్యత అప్పగించారు.

30కి పైగా నమూనాలు

3 రంగుల జెండాకు ముందు.. పింగళి మరిన్ని నమూనాలు తయారు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా పనిచేసిన పింగళికి.. విశాల భారతావనిని ప్రతిబింబించేలా ప్రత్యేక పతాకం ఉండాలనే కోరిక ఉండేది. ఆ ఆలోచనలతోనే 1916లో "ఏ నేషనల్‌ ప్లాగ్‌ ఫర్‌ ఇండియా" పేరుతో పుస్తకం రాశారు. అందులో 24 రకాల నమూనాలు ప్రతిపాదించారు. 1921 వరకు.. వివిధ దేశాల పతాకాలపై పరిశోధనలు చేశారు. విభిన్న రంగుల కలయికతో 30 పైగా జెండాలు రూపొందించి.. విజయవాడ సభలో గాంధీ ముందుంచారు.

3 గంటల్లోనే..

పింగళి ప్రయత్నం, కృషిని మహాత్ముడు ఎంతో మెచ్చుకున్నా.. ఆ జెండాల్లో ఏ ఒక్కటీ ఆయనకు నచ్చలేదు. హిందూ, ముస్లింలకు చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఒక జెండా తయారు చేయాలని సూచించారు. అందుకు ఎవరూ అడ్డుచెప్పకపోవడం వల్ల 3 గంటల వ్యవధిలోనే జెండా సిద్ధమైపోయింది. అది బాపూజీకీ బాగా నచ్చింది. అయితే మిగతా మతస్తులకూ చోటుండాలని భావించి తెలుపు రంగును చేర్చాలని సూచించారు. మధ్యలో చరఖా చేర్చితే బాగుంటుంది అంటూ హన్స్‌రాజ్‌ సలహా ఇవ్వగా.. అందుకు గాంధీ సమ్మతించారు.

ఉద్యమస్ఫూర్తిని రగిల్చింది..

మహాత్ముడి సూచనల మేరకు జాతీయ పతాకం తయారీకి కొంచెం ఆలస్యం కావటంతో అప్పటి కాంగ్రెస్ సదస్సులో ఆమోదించలేకపోయారు. కానీ ఆ ఆలస్యం మంచిదేనని.. జెండాను మరింతగా తీర్చిదిద్దటానికి, ఆమోదనీయంగా మలచటానికి మంచి అవకాశమని ఆ తర్వాత గాంధీ స్వయంగా రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించకున్నా.. పింగళి జెండా ప్రజల్లోకి వేగంగా చొచ్చుకుపోయింది. ఉద్యమస్ఫూర్తిని రగిల్చింది. 1931లో జాతీయ కాంగ్రెస్‌ తన అధికారిక జెండాగా స్వీకరించింది.

కమిటీ ఏర్పాటు..

వాస్తవానికి... జాతీయ జెండా రంగులు... అవి ప్రాతినిధ్యం వహించే మతాల విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు.. కేవలం హిందూ, ముస్లింలకే జెండాలో ప్రాధాన్యతనివ్వడాన్ని వ్యతిరేకించారు. అందరికీ ఆమోదయోగ్యమైన జెండాను రూపొందించాలనే వాదన వచ్చింది. దాంతో.. జెండా రూపకల్పన, మార్పు చేర్పులకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య కన్వీనర్‌గా ఏర్పాటైన ఆ కమిటీలో సర్దార్ వల్లబ్​భాాయ్‌ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి కీలక నేతలు సభ్యులుగా ఉన్నారు.

కాంగ్రెస్ కమిటీ ప్రత్యేక జెండా..

దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి సలహాలు, సూచనలను స్వీకరించిన కాంగ్రెస్‌ కమిటీ... ప్రత్యేకంగా తానో జెండా రూపొందించింది. పూర్తిగా కాషాయ వర్ణంపై ఎరుపు రంగు చరఖా చిహ్నంతో ఆ పతాకం ఉంది. కానీ... ఈ ప్రతిపాదన, జెండా నమూనాను 1931లో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. పింగళి రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రజల్లో విశేష ఆదరణ పొందిందని.. దాన్ని సమూలంగా మార్చడం మంచిది కాదని అభిప్రాయపడింది. అంతగా అవసరమైతే పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్నే మెరుగుపర్చుకుని ఉద్యమం సాగించాలని నిర్ణయించింది.

గౌరవం దక్కకుండా చేశాయా..?

పూర్తి స్వాతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించిన తర్వాత చరఖా స్థానంలో ఆశోక చక్రం వచ్చి చేరింది. ఈ మార్పు గాంధీకి ఇష్టం లేదని కొంతమంది చెబుతుంటారు. ఏది ఏమైనా...ఈ మార్పుచేర్పులే జాతీయ జెండా రూపకల్పనలో విశేష కృషి చేసిన పింగళికి తగినంత గుర్తింపు, గౌరవం దక్కకుండా చేశాయని కొంత మంది వాదన. ప్రభుత్వాలు ఆయన్ను పట్టించుకోలేదని చాలా మంది విమర్శిస్తుంటారు. ఇప్పుటికీ.. జాతీయ జెండా సమాచారాన్ని అందించే ప్రభుత్వ వెబ్‌సైట్లో... 1921 బెజవాడ కాంగ్రెస్ సమావేశంలో ఒక ఆంధ్రా యువకుడు ఒక జెండాను తయారు చేసి గాంధీకి చూపించారు అని మాత్రమే ఉంటుంది.

ప్రస్తుత జాతీయ జెండాను పింగళి మాత్రమే రూపొందించారని చెప్పలేమని.. పింగళి జెండాకు చాలా మార్పులు జరిగాయన్నది మరికొందరి వాదన. ముఖ్యంగా చివరి దశలో చోటు చేసుకున్న అశోక చక్ర మార్పు నెహ్రూ ప్రతిపాదించారని, ఆయనకు.. తన కార్యాలయంలోని ఓ ఉన్నత ఉద్యోగి భార్య ఆ సలహా ఇచ్చారనేది మరికొందరి మాట. అందుకే.. ఆమెనే ప్రస్తుత జాతీయ జెండా రూపకర్తగా గుర్తించాలనే వారూ ఉన్నారు. కానీ... ఈ వాదనలకు ఎలాంటి సాక్ష్యాధారాలు కనిపించడం లేదు. అందుకే... ఎన్ని మార్పు చేర్పులు జరిగినా... ప్రస్తుత జాతీయ పతాకానికి పింగళి రూపొందించిన పతాకమే మాతృక అన్నది ఎక్కువ మంది చెప్పే మాట.

ఇవీచూడండి: ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతా: తారక్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.