ETV Bharat / city

మార్కెట్​లో రాధాకృష్ణుల డిమాండ్

కృష్ణాష్టమి వేళ... తల్లిదండ్రులు వెన్నదొంగ చిన్నికృష్ణుడు బుజ్జిబుజ్జి అడుగులతో తమ ఇంట్లో కనువిందు చేయాలనుకుంటారు. తమ పిల్లలను చిలిపి కృష్ణుడిలాగానో, ముద్దులొలికే గోపెమ్మలుగానో చూడాలనుకుంటారు. అందుకే మార్కెట్​లో జన్మాష్టమిని పురస్కరించుకుని రాధాకృష్ణుల దుస్తుల డిమాండ్ పెరిగింది. ఎక్కడచూసినా రంగురంగుల చిన్ని కిట్టయ్య వస్త్రాలు, గోపికల పెరుగు ముంతలు, కన్నయ్య వేణువులే దర్శనమిస్తున్నాయి. తల్లిదండ్రులంతా తమ చిన్నారుల కోసం ప్రత్యేకంగా రాధాకృష్ణుల కాస్ట్యూమ్స్​ కొనుగోలు చేస్తున్నారు.

author img

By

Published : Aug 24, 2019, 3:55 PM IST

Updated : Aug 24, 2019, 5:04 PM IST

మార్కెట్​లో రాధాకృష్ణుల డిమాండ్
మార్కెట్​లో రాధాకృష్ణుల డిమాండ్

ప్రతి తల్లి తన పిల్లాడిని చిన్ని కృష్ణుడుగానే భావిస్తుంది, చిట్టి తల్లిని రాధగానో, గోపిగానో ముద్దుగా చూసుకుంటుంది. కృష్ణాష్టమి రోజున తమ పిల్లలకు ప్రత్యేక అలంకరణ చేసి మురిసిపోవడం నేటిది కాదు ఏనాటి నుంచో వస్తున్న సంప్రదాయమే. ఇప్పుడు పాఠశాలల్లో చిన్నారులకు సంప్రదాయ పండుగలను పరిచయం చేసే ఉద్దేశంతో అన్ని పర్వదినాలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కోసం గోపిక, కృష్ణుల వేషధారణకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మార్కెట్​లో ఎక్కడ చూసినా... ఆయా వస్త్రాలే దర్శనమిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువున్నా పర్వాలేదని... పిల్లల ముద్దే ముఖ్యమంటున్నారు తల్లిదండ్రులు.

గోకులాష్టమి ప్రత్యేక డిజైన్లు

గోకులాష్టమి పురస్కరించుకుని నగరంలోని కోటీ, సుల్తాన్ బజార్, బేగం బజార్, దిల్​సుఖ్​నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోని మార్కెట్లలో గోపిక వస్త్రధారణకు కావాల్సిన ముత్యాల గొలుసులు, దుపట్టాలు, లంగా జాకెట్ల సెట్లు, వెన్న ముంతలు వివిధ ఆకృతులు, సరికొత్త డిజైన్లతో దర్శనమిస్తున్నాయి. ఇక కన్నయ్య కోసం ప్రత్యేకంగా వేణువులు, ముత్యాల హారాలు, నెమలి పింఛాలు, కిరీటాలు, పట్టు పంచెలు అందుబాటులోకి తీసుకువచ్చారు అమ్మకం దారులు.

వందకు పైగా డిజైన్లు

ఒక్కో రకమైన వేషధారణ కోసం దాదాపు వందకు పైగా డిజైన్లు మార్కెట్​లో దర్శనమిస్తున్నాయంటే ఈ పండుగపై తల్లిదండ్రుల ఆసక్తి అర్థం చేసుకోవచ్చు.

తల్లిదండ్రుల సంబురం

వెన్నదొంగ పుట్టిన రోజున తమ ఇంటి కన్నయ్యలను అందంగా ముస్తాబు చేసి, గోపెమ్మలను ముద్దుగా అలంకరించి తనివితీరా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. అంతేనా... వాట్సాప్, ఫేస్​బుక్​లల్లో పోస్టులు చేసి సంబురపడుతున్నారు.

sample description
Last Updated : Aug 24, 2019, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.